జ‌గన్ వ‌రమిస్తున్నా.. క‌నిక‌రించ‌ని కోట‌రీ పూజారులు!

ఆర్థిక ఇబ్బందుల‌తో సిగ్గు విడిచి, జ‌గ‌న్ చెప్ప‌డాన్ని గుర్తు చేసి, సాయం చేయాల‌ని వేడుకున్నా వీళ్ల‌కు క‌నిక‌రం లేకుండా పోయింది.

త‌న‌ను క‌లిసిన వివిధ ర‌కాల వ్య‌క్తుల‌కు సాయం అందించాల‌ని వైఎస్ జ‌గ‌న్ త‌న చుట్టూ ఉన్న ముఖ్య నేత‌ల‌కు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఆదేశాలు అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సాయం చేయ‌లేక‌పోయాన‌ని వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల అన్నారు. ఈ ద‌ఫా జ‌గ‌న్ పాల‌న 2.0లో మొద‌టి ప్రాధాన్య‌త పార్టీ కేడ‌ర్‌కే అని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

అయితే క‌ష్టాల్లో ఉన్న కొంద‌రు వైసీపీ నాయ‌కులు, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన ముఖ్యులు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ క‌ష్టాలు చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా వాళ్ల‌కు ప్ర‌తినెలా ఆర్థిక సాయం అందించాల‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, అలాగే సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారాల్ని చూసే మ‌రో యువ‌కుడిని జ‌గ‌న్ ఆదేశించారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌ని కేసులు ఎదుర్కొని, జైలుకు వెళ్లొచ్చిన వాళ్ల‌కు మాత్రం ఉడ‌తాభ‌క్తిగా సాయం అందించారు.

కానీ ఇత‌ర‌త్రా వ్య‌క్తుల విష‌యంలో జ‌గ‌న్ ఆదేశాలేవీ ప‌ని చేయ‌డం లేద‌ని వాపోతున్నారు. నాలుగు నెల‌ల క్రితం జ‌గ‌న్ ఆర్థిక సాయం చేయాల‌ని చెప్పిన‌ప్పుడు కొత్త ఏడాది నుంచి ఆదేశాలు అమ‌ల‌వుతాయ‌ని ….స‌జ్జ‌ల‌, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, స‌ద‌రు సోష‌ల్ మీడియా బాధ్యుడు చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌ళ్లీ అడ‌గాల్సిన ప‌ని లేకుండా, సాయం అందిస్తార‌ని ఆశించిన వాళ్ల‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

దీంతో ఆర్థిక ఇబ్బందుల‌తో సిగ్గు విడిచి, జ‌గ‌న్ చెప్ప‌డాన్ని గుర్తు చేసి, సాయం చేయాల‌ని వేడుకున్నా వీళ్ల‌కు క‌నిక‌రం లేకుండా పోయింది. ఇప్పుడు ప‌రిస్థితి బాగాలేద‌ని, ఇంకొంత స‌మ‌యం ప‌డుతుందంటూ కాల‌యాప‌న చేస్తున్నారు. అరె జ‌గ‌న్ ఉత్తుత్తి హామీ ఇచ్చారా? ఇవేం నాట‌కాల‌ని తిట్టుకునే ప‌రిస్థితి అంటున్నారు. హామీలు పొందిన వాళ్లు. జ‌గ‌నే సాయం చేయాల‌ని ఆదేశిస్తే, చేయ‌డానికి వీళ్ల‌కొచ్చిన ఇబ్బంది ఏంట‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

దేవుడు వ‌ర‌మిచ్చినా, పూజారి ప‌ట్టించుకోన‌ట్టుగా వుంది… ఈ వ్య‌వ‌హారం అని వైసీపీ బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు తెలుసో, లేదో కూడా అర్థం కావ‌డం లేదంటున్నారు. ఒక‌వేళ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాల‌ని అనుకున్నా, ఇక అపాయింట్‌మెంట్స్ దొర‌క‌వ‌ని మండిప‌డుతున్నారు. ఇలా త‌గ‌ల‌డుతోంది.. జ‌గ‌న్ హామీల అమ‌లు.

32 Replies to “జ‌గన్ వ‌రమిస్తున్నా.. క‌నిక‌రించ‌ని కోట‌రీ పూజారులు!”

  1. నేను కొట్టినట్లు నటిస్తా …నువ్వు ఏడ్చినట్లు నటించు బాపతు…

  2. మద్యం లో. సంపాదించిన సొమ్ములు. దుబాయ్ వెళ్ళిపోతే. మల్ల అవి వచ్చే వరకు కాస్త ఆగాలి సామ్మి

  3. చూశావా GA….ఒక పక్క PAWAN KALYAN గారు సొంత డబ్బు తో GOVT Contract employees కి 2 months salary ఇస్తే…..వేల కోట్ల ప్రజల డబ్బు దోచుకున్న మీరు చేసే పనులు ఇవి….మళ్లీ సిగ్గులేకుండా pawan kalyan గారికి నీతులు చెప్పడం extra…..

  4. బాబూ రాజా….. అదేదో సినిమాలో అల్లరి నరేష్ తన షాపు కి వచ్చే వాళ్లకి టీ చెప్పినట్టు నటించి హోటల్ వాడికి వద్దని సైగ చేస్తూ ఉంటాడు…. ఇది అదే బాపతా

  5. బెజ్జాల రామకృషుడి ని నమ్మే 151 నుండి 11 కి

    ఇంకా నమ్మితే 11 నుండి 1 కి

  6. మా అన్నయ్య కాయ కష్టం చేసిన సంపాదించిన డబ్బులు అంటున్న క్యాడర్

  7. జగన్ గాడి నాటకాలు.

    వాడికి నొక్కెయ్యడమే కానీ ఇవ్వడం తెలీదు.

    వాడు డబ్బు ఇస్తాడు అంటే ఎవడు నమ్ముతాడు?

    ఓరి వే సా లు..

    1. అలా చేస్తే లైలా జగ్లక్ గాడికి రెండో రోజే పెద్ద దినం పెట్టేస్తుంది

  8. Power lo vunnappudu varam isthe elano edho department lo fake employee ga Petti adjust cheyochu… Ipudu varam isthe chettu ninchi vudi padathaya? Vallu matram ekkadi ninchi techi istharu entha mandiki istharu .

    Oka idea.. Annane party cheque book pettukoni , adigina vallaki sign chesi isthe saripotadhi..

  9. సహాయం చెయ్యమని వాళ్లకి వీళ్ళకీ చెప్పడం ఎందుకు?? ఈ దళారీ లు లేకుండా

    కార్యకర్తలకి డైరెక్ట్ గా వాళ్ల అకౌంట్ లో పడేట్టు 2.0 బటన్ నొక్కుడు నాటకాలు ఆడొచ్చు కదా??

  10. తాను తెచ్చి పెట్టుకున్న “కోటరీ” ని మేనేజ్ చేయలేనోడు.. ఇక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఎలా పరిపాలించగలడని అనుకొంటున్నారు..

    వీడి మాటలు నమ్మే కదా 151 ఇచ్చారు.. 5 ఏళ్ళ తర్వాత కోటరీ నష్టం చేసింది అని తేల్చేశారు..

    ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలంటున్నాడు.. అదేదో 2.0 అంటున్నాడు..

    మళ్ళీ వీడిని నమ్మి అధికారం ఇస్తే.. అయిదేళ్ల తర్వాత కోటరీ కనికరించలేదని ఏడుస్తూ కూర్చోవాలా..?

    వీడికి బుద్ధి చెప్పాలనే కదా.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.. ఇంకా అదే కోటరీ మీద సాకులు చెప్పుకుంటూ ఉంటె.. ఈ 2.0 ని నమ్మేదెలా..?

    ..

    అయ్యా.. ఇవేవీ అయ్యే పనులు కావు.. జగన్ రెడ్డి కి ఆ కోటరీ కి ఏవో పర్సనల్ సమస్యలు ఉన్నాయేమో.. అవి రాష్ట్రం మీద రుద్ది .. రాష్ట్ర ప్రజల బతుకులు నాశనం చేయకండి..

    గత ఐదేళ్లు సంపాదించుకొన్నారు కదా.. ఎక్కడికైనా పోయి హాయిగా బతకండి.. మమ్మల్ని వదిలేయండి..

  11. adi common, prathee nela evaru ivvaru.

    Blame Jagan meedaki raakudadu. anduke kadaa vaallani pakkana undedi.

    CBN or JAGAN or Local politician –> OK, cheseddam, icheddam ani antaaru, alaa jaragadu.

  12. GA గారు ycp ఏమయినా పది మంది అద్యక్షులున్న ప్రజాస్వామ్య పార్టినా…….జగన్ సర్వాధిపత్యం గలిగిన పార్టి …..అలాంటిది కిందివాళ్ళు మాటవినలెదంటె ఎవరిని అనాలి……..

  13. సహాయం ఎలా చెయ్యాలో లోకేష్, పవన్ లని అడిగి తెలుసుకోమను మన అన్నియ్యని.

  14. మంచి అయితే జగన్దీ వంద శాతం క్రెడిట్…. చెడు అయితే కోటరిది మా అన్న అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు, కోటరీనే మోసం చేశారు అని చెప్తారు….

  15. ఎంగిలి చేత్తో కాకిని తరిమితే మెతుకులు పడిపోతాయని భావించే వాడు తన స్వంత సొమ్ము ఎందుకు పెంచుతారు? తేరగా ప్రజాధనం వస్తే పంచుతాడు.

  16. వరాలు ఇవ్వటానికి, మొక్కులు తీర్చటానికి వాడేమన్నా దేవుడా, పరమ నీచుడు!! ఏ పని చేతకాదు చేయలేడు, కోటరీ లేకపోతే ఈ brainless / useless fellow కి దిక్కు ఎవరు??

  17. సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టినోళ్లకు సాయం చేయకపోతే వాళ్ళు తమ చేత ఎవరు పోస్ట్లు పెట్టించేరో వెంటనే రుజువులతో సహా చెప్పేస్తారు అప్పుడు బొక్కలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వాళ్లకు ఇస్తున్నారు

  18. “జ‌గన్ వ‌రమిస్తున్నా.. క‌నిక‌రించ‌ని కోట‌రీ పూజారులు!”…i do not think so…probably Jagan wants the end result to be that way..do not help

  19. దైవ సహాయానికి అడ్డు పడుతున్న కాపరులు అని క్లారిటీ గా వ్రాయి.. నీకు పూజరుల గోల ఎందుకు

Comments are closed.