రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జ‌న్యాల‌ను నిర‌సిస్తూ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది.

అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జ‌న్యాల‌ను నిర‌సిస్తూ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. టీడీపీ అరాచకాల‌కు పోలీసులు స‌హ‌క‌రిస్తున్నార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం గాండ్ల‌పెంట ఎంపీపీ స్థానానికి ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గాండ్ల‌పెంట‌లో ఏడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో ఆరుచోట్ల వైసీపీ, ఒక చోట మాత్రం టీడీపీ గెలుపొందింది.

ఎన్నిక కోసం క‌దిరి నుంచి గాండ్ల‌పెంట‌కు వైసీపీ అభ్య‌ర్థులు బ‌య‌ల్దేర‌గా, మార్గ‌మ‌ధ్యంలో పోలీసులు త‌మ మార్క్ సోదాల‌తో అడ్డుకున్నారు. స‌మ‌యం మించిపోవ‌డంతో ఎన్నిక‌ను వాయిదా వేసిన‌ట్టు ఎన్నిక అధికారి తెలిపారు. అయితే ఇదే తంతు శుక్ర‌వారం కూడా కొన‌సాగ‌డంతో, ఇక ఎన్నిక‌లో పాల్గొన‌డం అన‌వ‌స‌ర‌మ‌ని వైసీపీ భావించింది. దీంతో ఎంపీపీ ఎన్నిక‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది.

ఇదే రీతిలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌గిరి ఎంపీపీ ఎన్నిక‌ను కూడా వైసీపీ బ‌హిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం. పోలీసులు పూర్తిగా ప‌రిటాల కుటుంబానికి వ‌త్తాసు పలుకుండ‌డంతో, ఇక చేయ‌గ‌లిదేమీ వుండ‌ద‌ని భావించిన వైసీపీ బ‌హిష్క‌ర‌ణ‌తో త‌మ నిర‌స‌న ప్ర‌క‌టించింది.

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌గిరి మండ‌లంలో 10 ఎంపీటీసీ స్థానాల‌కు 9 చోట్ల వైసీపీ గెలుపొందింది. ఎంపీపీ నాగ‌మ్మ మ‌ర‌ణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఎంపీపీ ప‌ద‌వి ద‌క్కాలంటే క‌నీసం ఐదుగురి మ‌ద్ద‌తు అవ‌స‌రం. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ స‌భ్యులు ఎన్నిక కోసం బెంగ‌ళూరు క్యాంప్‌ నుంచి రామ‌గిరికి చేరుకునే క్ర‌మంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కోరం లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ను వాయిదా వేశారు. పేరూరు-2 ఎంపీటీసీ స‌భ్యురాలు భార‌తిని కిడ్నాప్ చేశారు.

అయితే రామ‌గిరి ఎంపీపీ మ‌హిళ‌కు రిజ‌ర్వేష‌న్ చేయ‌డం, టీడీపీ త‌ర‌పున గెలిచిన వ్య‌క్తి పురుషుడు కావ‌డంతో ఆ పార్టీకి ఇర‌కాట ప‌రిస్థితి. దీంతో వైసీపీ మ‌హిళ‌ల‌ను త‌మ వైపు లాక్కోవాల్సిన దుస్థితి టీడీపీకి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో య‌థేచ్ఛ‌గా కిడ్నాప్‌, దౌర్జ‌న్యాలు సాగుతున్నా, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా లాభం లేక‌పోవ‌డంతో వైసీపీ ఎంపీపీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం.

8 Replies to “రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌”

  1. ఆ మహిళను కిడ్నపు చెయ్యటం కంటే… దౌర్జన్యాలు.. ఈ చిల్లర రాజకీయం చెయ్యటం కంటే.. టీడీపీ ఆ గెలిచిన ఆ ఒక్క ఎంపీపీ గాడికి లింగ మార్పిడి చేస్తే సరి.

      1. జనాలు అనగా ఎవరు అండి .. సజ్జల గారు చెప్పిన ఓటర్ల .. .. వాళ్ళతో మీరు గెలవలేరు అని ౨౦౨౪ నేర్పించేసింది .. ఇంకా మీరు దూరం చేసుకున్న ఓటర్ల గురించి అయితే మీరు మర్చి పోవచ్చు ..

        1. ఓటర్లు వరకు అక్కర్లేదు సగం క్యాడర్ దూరం అవుతారు ఏం జరిగినా గట్టిగా కళ్ళు మూసుకొండి మూడేళ్ల లో మన ప్రభుత్వం వస్తుంది అప్పటివరకు అన్ని భరించండి అంటుంటే..

    1. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి నామినేషన్ పేపర్లు ఎత్తుకెళ్లి నీతి నిజాయితీ గా గెలిచినట్లు బిల్డప్ ఇస్తున్నారు గా

  2. కూటమి ఇలాంటి పనిచేస్తే మీరు కూడా భయం చెప్పండి ఎంపీటీసీ లతో రాజీనామా చేయించేసేయండి మీకు కావలసినంత ప్రజాబలం వుందికదా తిరిగి ఎలక్షన్ లకు వెళ్లొచ్చు గెలవొచ్చు

Comments are closed.