మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఐదు నుంచి పది కోట్లు ఖర్చు చేసి, అంతకు అంత.. అంతంత.. బాక్సాఫీస్ నుంచి లాగేయగల సత్తా ఉంది మలయాళ సినిమా మేకర్లకు. కానీ ఆ భాష సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో మాత్రం వంద కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం వారికి రావడం లేదు. చాలా అంటే చాలా రేర్‌గా భారీ సినిమాలు హిట్ అవుతాయి మోహన్ లాల్‌తో చేస్తే.
దాదాపుగా మోహన్ లాల్ చేసిన అతి భారీ, భారీ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడనివే. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు తీసుకుంటారు. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తారు. కానీ తీరా ఫలితం చూస్తే ఏమీ ఉండదు.
లూసిఫర్ సినిమాను సింపుల్‌గా తీసి విడుదల చేస్తే మంచి పేరు వచ్చింది. దానికి సీక్వెల్‌ను వందల కోట్లు ఖర్చు చేసి తీసారు. చూస్తే అస్సలు విషయం లేదు. కేవలం హంగామా తప్ప. ఈ సినిమా వల్ల లైకా లాంటి పెద్ద సంస్థ ఫైనాన్షియల్‌గా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత లాస్ట్ మినిట్‌లో రెండు వేరే సంస్థలు వచ్చి జాయిన్ అవ్వాల్సి వచ్చింది.
సినిమా చూస్తే “ఎందుకు అస్సలు కథ లేకుండా ఇంత భారీ ఖర్చు చేసేశారు?” అనిపించింది. కేవలం తమ ప్యాషన్ తీర్చుకోవడం కోసం నిర్మాతలను బలిపెట్టారు అనిపించింది. మలయాళం జనాలు తెలుగు వారి మాదిరిగా భారీ సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూనే వస్తున్నారు కానీ కుదరడం లేదు. ఒకటి రెండు తప్ప మలయాళం భారీ సినిమాలు హిట్ అయిన దాఖలాలు లేవు.
చిన్న సినిమాల దగ్గర మాత్రం మనవాళ్లు మలయాళం మేకర్లను ఆదర్శంగా తీసుకుని అప్పుడప్పుడు చిన్న సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు. కానీ వైస్ వెర్సా మలయాళం వాళ్లు మాత్రం పెద్ద సినిమాలు సరిగ్గా అందించలేకపోతున్నారు. అదీ విషయం.
In last decade big budget failures mostly from mohan lal is major highlight….
