కాస్త పేరుండి. ఎప్పుడో జమానా కాలం నాడో, లేదా రీసెంట్ గానో ఒక హిట్ నో, యావరేజ్ సినిమానొ కొట్టిన దర్శకులు అందరికీ విక్టరీ వెంకటేష్ నే ఆపద్భాంధవుడిలా కనిపిస్తున్నారు. నిజంగా ఆయన వింటారో, వినరో తెలియదు. కానీ వెంకటేష్ కు ఫలానా దర్శకుడు కథ రెడీ చేస్తున్నారు. ఫలానా దర్శకుడు కథ చెప్పబోతున్నారు అంటూ గ్యాసిప్ లు మాత్రం పుట్టిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే అతి పెద్ద సూపర్ హిట్ తరువాత ఇప్పటి వరకు వెంకటేష్ ఎవరికీ ఓకె చెప్పలేదు. అటు నిర్మాతలు చాలా మందే వున్నారు. కానీ కావాల్సింది సరైన కథ, దర్శకుడు.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు విపరీతంగా వర్క్ చేయడం వల్ల మోకాలి నొప్పి వచ్చింది. దానికి రెస్ట్ తీసుకోవడమే మందు. అదే పనిలో వున్నారు. ఈ లోగా వివి వినాయక్, హరీష్ శంకర్, ఇంకా..ఇంకా..ఇంకా చాలా మంది వెంకటేష్ కు కథలు చెప్పే పనిలో వున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే కథ అనేది ముందు సురేష్ బాబుకు నచ్చాలి. ఓకె అనాలి. ఆయన చెప్పే కరెక్షన్లు అన్నీ దాటాలి. అప్పుడు కానీ వ్యవహారం ముందుకు వెళ్లదు.
ఇది వరకు వెంకటేష్ వేరు. ఇప్పుడు వేరు. సరైన సినిమా పడితే వందల కోట్లు కళ్ల చూడొచ్చు అని అర్థం అయింది. తరువాత సంగతి ఎలా వున్నా, ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసే సినిమాకు గట్టిగా మార్కెట్ వుంటుంది. అందువల్ల రెమ్యూరేషన్ కూడా అదేే రేంజ్ లో వుంటుంది. దీనికి అనుగుణంగా మార్కెట్ లెక్కలు చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే చాలా అంటే చాలా టైమ్ పడుతుంది.
పైగా 2026 సమ్మర్ వరకు దాదాపుగా ఓటీటీ స్లాట్ లు అన్నీ అయిపోతున్నాయి. స్లాట్ చూసుకుంటే తప్ప రంగంలోకి దిగడం కష్టం. అందువల్ల వెంకీ మామ సినిమా అనౌన్స్ మెంట్ ఇప్పుడే వుండకపోవచ్చు. అప్పటి వరకు గాలివార్తలు అలా వినిపిస్తూనే వుంటాయి.