సకుమార్ రైటింగ్స్ అంటూ ఓ బ్యానర్ స్టార్ట్ చేసి, దాని ద్వారా తన సహాయకులను ప్రమోట్ చేసే పని గతంలోనే స్టార్ట్ చేసారు. లేటెస్ట్ గా రెండు ప్రాజెక్టులు ప్లాన్ చేసారు. అందులో ఒకటి నాగశౌర్య హీరోగా శరత్ మరార్ నిర్మాతగా అనౌన్స్ చేసారు. ఇటు నాగశౌర్య గానీ అటు శరత్ మరార్ కు కానీ సుకమార్ చెప్పిందే వేదం. కథ ఇదేంటీ అని అడిగేంత సీన్ వుండదు. అందువల్ల కావచ్చు అక్కడ ప్రాజెక్టు షురూ అయింది.
కానీ అంతకన్నా ముందుగా గీతా 2 సంస్థలో ఓ సినిమా సూర్యప్రతాప్ డైరక్టర్ గా సినిమా ప్లాన్ చేసారు సుకుమార్. నితిన్ హీరోగా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును సుకుమార్ స్వయంగా చేయడం కానీ, వేరే వాళ్ల బ్యానర్ లో చేయాలని కానీ అనుకుంటున్నట్లు బోగట్టా. దీనికి కారణం ఒకటే. సుకుమార్ తయారు చేసిన, చేయించిన కథ అల్లు అరవింద్ కు నచ్చలేదని తెలుస్తోంది.
అయితే కథ ను అటు ఇటు చేయడం లేదా చేయించడం వల్ల సుకుమార్ తో గీతా సంస్థకు వున్న రిలేషన్ పాడుచేసుకోవడం అవుతుందని భావించి, స్మూత్ గా ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది. వేరే వాళ్లకుచేస్తే మళ్లీ అరవింద్ ఫీలవుతారేమో అని, సుకుమార్ నే సంతంగా చేసుకోవాలని చూస్తున్నారట.