cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

నాగబాబు.. డైరెక్ట్ అటాక్

నాగబాబు.. డైరెక్ట్ అటాక్

ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, వీళ్లు వాళ్లు అని కాకుండా, మెగా క్యాంపేతర, జనసేనేతర జనాలను పట్టుకుని, విమర్శిస్తూ వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు నటుడు నాగబాబు. దీనివల్ల యూట్యూబ్ ఆదాయం ఆయనకు బాగానే వస్తోందని, అందుకే ఇదంతా అని కూడా విమర్శలు వున్నాయి.

ఆ సంగతి అలావుంచితే, ఈరోజు తొలిసారి తెలుగుదేశం అనుకూల మీడియా మీద విమర్శల దాడికి దిగారు నాగబాబు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఓ చిన్న వీడియో. ABN రాధాకృష్ణ చిడతలు పట్టుకుని భజన చేస్తున్నట్లుండే మార్పింగ్ వీడియో అది.

దావోస్ సదస్సుకు వెళ్లిన లోకేష్ అనుభవంపై ABN ప్రసారం చేసిన ఓ కథనాన్ని ప్రదర్శిస్తూ, దాన్ని చూస్తూ నాగబాబు కూడా భజన చేస్తూ, కామెంట్ లు చేస్తూ, సెటైర్ లు వేస్తూ, ఓ వీడియో తయారుచేసారు. టోటల్ గా ఈ వీడియో ద్వారా ABN ఛానెల్ బాబుకు, లోకేష్ కు భజన చేస్తోందని డైరెక్ట్ గా చెప్పేసారు.

మొత్తానికి నాగబాబు వ్యవహారం రోజు రోజుకు ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు పార్టీలను టార్గెట్ చేస్తే అదో తీరు. ఇప్పుడు మీడియాను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి,

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?