ఈ ‘సీత’ రివర్స్ క్యారెక్టరా?

బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా సీత. ఈ సినిమా బాగా వస్తోందని టాక్ అయితే వుంది. అయితే ఈ సినిమా మొత్తం మూడు క్యారెక్టర్ల నడుమ పూర్తిగా పెర్ ఫార్మెన్స్ ల మీద…

బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా సీత. ఈ సినిమా బాగా వస్తోందని టాక్ అయితే వుంది. అయితే ఈ సినిమా మొత్తం మూడు క్యారెక్టర్ల నడుమ పూర్తిగా పెర్ ఫార్మెన్స్ ల మీద ఆధారపడి వుంటుందని తెలుస్తోంది. సినిమాకు వేరే వాళ్ల దగ్గర నుంచి కథ తీసుకుని, తేజ తన స్టయిల్ కు మార్చుకున్నారు.

హీరోయిన్ పేరు సీత అయినా, క్యారెక్టర్ రివర్స్ లో వుంటుందని, ఆమె తన చిత్తానికి వచ్చినట్లు, కేర్ నాట్ గా బిహేవ్ చేస్తుందని, దీనికి రివర్స్ లో హీరో చాలా ఇన్నోసెంట్ గా, ఆమె ఎలా అంటే అదే కరెక్ట్ అనే విధంగా వుంటాడని టాక్.

ఈ రెండు క్యారెక్టర్లతో పాటు సోనూసూద్ విలన్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా వుంటుందట. ఈ సినిమా వల్ల అందరికన్నా ఎక్కువ పేరు సోనుసూద్ కే వస్తుందని యూనిట్ వర్గాల బోగట్టా. సోనుసూద్, కాజల్ తరువాతే హీరో క్యారెక్టర్ కు పేరు వస్తుందని టాక్.

నిజం సినిమాలో విలన్ గా చేసిన గోపీచంద్ కు మాంచి పేరు వచ్చిన సంగతి జనాలకు గుర్తుంది. ఈ సినిమా మళ్లీ సోనుసూద్ కు తెలుగులో కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందంటున్నారు. అన్నీ బాగానే వున్నాయి. సీత క్యారెక్టర్ మరీ రాడికల్ గా వుంటే ఆ టైటిల్ ను, క్యారెక్టర్లను పట్టుకుని 'మనోభావాల మహానుభావులు' బయటకు వచ్చేస్తారేమో?

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి