Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని కోసం ముగ్గురు ఫిక్స్.. ఇంకా కావాలి!

నాని కోసం ముగ్గురు ఫిక్స్.. ఇంకా కావాలి!

నాని-విక్రమ్ కుమార్ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కోసం వరుసపెట్టి హీరోయిన్లను తీసుకుంటున్నారు. కానీ వాళ్లు చాలరట. ఇంకా కావాలంట. సౌత్ ఇండస్ట్రీ మొత్తం జల్లెడ పడుతున్నారు.

అవును.. నాని-విక్రమ్ కుమార్ సినిమా కోసం కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ వెంటనే మేఘా ఆకాష్ ను కూడా సెలక్ట్ చేశారు. ఆ తర్వాత ప్రియాప్రకాష్ వారియర్ ను ఎంపిక చేశారు. ఇలా ఒకేసారి ముగ్గుర్ని ఫైనల్ చేసిన తర్వాత అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో మరో ఇద్దరు ముద్దుగుమ్మల కోసం వేట మొదలుపెట్టారు.

మొత్తంగా నాని సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమాలో నానిది ప్లేబాయ్ టైపు పాత్ర అని తెలుస్తోంది. సినిమా మొత్తం సరదాగా సాగిపోతుందట.

ప్రస్తుతం నాని చేస్తున్న జెర్సీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ నెలలోనే విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ హీరో. గతంలో బన్నీతో ఓ సినిమా చేయడానికి తెగ ట్రై చేశాడు విక్రమ్ కుమార్. అది వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు అదే కథతో నానితో ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది.

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?