Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరింత భారీగా కేజిఎఫ్ 2

మరింత భారీగా కేజిఎఫ్ 2

కేజిఎఫ్ సినిమా ఈరోజు అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చింది. ఇదే సయయంలో రెండోభాగం స్టార్ట్ చేసే సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. మరింత బడ్జెట్ తో మరింత భారీగా, పాన్ ఇండియా నటీనటులను తీసుకుని సినిమాను రూపొందించే పనిలో వుంది కేజిఎఫ్ యూనిట్.

తొలిభాగానికి విపరీతమైన రెస్సాన్స్ వచ్చింది. హీరో పరిచయం లేకున్నా, కన్నడ సినిమా అయినా తెలుగునాట 15 కోట్ల వరకు వసూలు చేసింది. అదే మరింత ప్రచారం, బజ్, పరిచయం వున్న నటులు వుంటే ఆ రేంజ్ వేరుగా వుంటుంది. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా గట్టిగా పోటీపడింది.

అందుకే ఈసారి కేజిఎఫ్ లో విలన్ గా సంజయ్ దత్ ను తీసుకుంటున్నట్లు బోగట్టా. సంజయ్ దత్ విలన్ అంటే సినిమాకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ వస్తుంది. అలాగే సౌత్ ఇండియాకు కూడా సంజయ్ దత్ పరిచయమే. అలాగే ఒకరిద్దరు తెలుగు నటులను కూడా కొన్ని క్యారెక్టర్లకు తీసుకునే ఆలోచనలో వున్నట్లు బోగట్టా. ఈ సినిమా కేజిఎఫ్ 2 తెలుగులో భారీ విడుదలే వుంటుంది.

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?