రష్మిక మందాన హీరోయిన్గా చేసినవి తక్కువ చిత్రాలే కానీ ఐటీ అధికారుల దృష్టి పడేంతగా బాగానే ఆర్జించింది. ఐటీ దాడుల తర్వాత ఇన్కమ్ ఎందులోనయినా ఇన్వెస్ట్ చేయాలని ఆమె చూస్తోంది. బహుశా సినిమాలు నిర్మించడం ఒక ఆప్షన్లా అనిపించిందేమో యువ రచయితలకి మంచి కథలుంటే పంపమంటూ పిలుపిచ్చింది. రష్మిక ఈ విషయంలో సీరియస్‌గానే వుందనిపిస్తోంది.
సాధారణంగా హీరోయిన్లు నిర్మాణం జోలికి వెళ్లరు. వెళ్లిన కొద్ది మందికి కూడా చేదు అనుభవాలు ఎదురవడంతో స్టార్ హీరోయిన్లు సయితం ఆచి తూచి అడుగులేస్తుంటారు. సమంత, కాజల్ లాంటి వాళ్లు సొంతంగా నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ధైర్యం చేయలేదు. నిర్మాతగా మారే ఉద్దేశం వుందా లేదా అనేది చెప్పలేదు కానీ స్టోరీ రైటర్లకి పిలుపు ఇచ్చిందంటే రష్మిక ఆలోచన అదే అయి వుండవచ్చు.
హిందీలో అనుష్క శర్మ లాంటి వాళ్లు ప్రొడ్యూసర్స్‌గా సెక్సస్ అయినపుడు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ జమానాలో రష్మికకి కలిసి రావచ్చు. నాని బ్రాండ్ వుండడం వల్ల అతను నిర్మించే చిన్న సినిమాలు ఈజీగా పాస్ అయిపోతున్నపుడు రష్మిక కూడా తన పాపులారిటీని ఇలా యూజ్ చేసుకోవడం బ్యాడ్ స్టెప్పేం కాదు.