హమ్మయ్య..మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇదేదో కొత్త విషయం కాదు. జనాలకు తెలిసిందే. చిరకాలంగా ఆంధ్రజ్యోతి ఎందుకు ఇంత భయంకరంగా వైఎస్ ను ఆ తరువాత జగన్ ను టార్గెట్ చేస్తోందా? ఎందుకు ఆంధ్రలో రాష్ట్రపతి పాలన విధించాలన్నంతగా పరిస్థితులను భూతద్దంలో చూపిస్తోందా? అని అనుకునేవారు చాలా మంది. అయితే చాలా మందికి తెలుసు ఆ మీడియా కమ్మవారిది. జగన్ రెడ్డి. అందుకే పడదు. అందుకే అలా రాస్తున్నారు అని లోలోపల అనుకునేవారు.
కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో కమ్మవారికి అన్యాయం జరుగుతోంది. కమ్మకులాన్ని టార్కెట్ చేస్తున్నారు. జగన్ కు కమ్మవారంటే పడదు. కమ్మవారికి పనులు చేయడం లేదు. కమ్మవారి బిల్లులు చెల్లించడం లేదు. ఇలా రాష్ట్రంలో వున్న కమ్మవారి కష్టాలు అన్నీ ఈవారం తన పలుకులో ఏకరవు పెట్టారు ఆర్కే. అంతే కాదు, ఈ విషయంలో కమ్మసంఘాలు మౌనంగా వుండడాన్నికూడా తప్పు పట్టారు.
''…..రెడ్లను ఏదో అన్నాడని జన సేనాని పవన్‌కల్యాణ్ నాలుక కోస్తామని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు క్షణం ఆలస్యం చేయకుండా హెచ్చరించారు. కమ్మ కులం వారిని పోలీసు శాఖలో వేధిస్తున్నా, ఇతర స్థానాల్లో ఉన్న అధికారులను మానసికంగా కుళ్లబొడుస్తున్నా కమ్మ సంఘాలు మాత్రం నోరు మెదపలేదు. అది సంస్కారమో, పిరికితనమో తెలియదు…..''
కమ్మసంఘాలకు వున్న పిరికితనం లేదు కనుకే ఆర్కే ఇలా పోరాడుతున్నారు అనుకోవాలి. లేదా కమ్మసంఘాల పెద్దలకు మీడియా లేదు కనుక వారు మౌనంగా వున్నారు. కానీ ఆర్కేకు మీడియా వుంది కనుక పోరాడుతున్నారు అనుకోవాలి. ఆర్కే మరో మాట కూడా సెలవిచ్చారు.
''…..ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారతారు అని చెప్పడానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నామని వైసీపీకి చెందిన రెడ్డి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు…..''
ఈ మాటలు కమ్మవారిని మరింత రెచ్చ గొట్టడానికి తప్ప మరెదుకు కాదు అని అర్థం అవుతూనే వుంది. పైగా వైకాపా కు చెందిన రెడ్డి నాయకుడు అన్నారు. వైఎస్ ఓసారి ఇలా అన్నారట, వారు ఇలా అన్నారట. వీరు ఇలా అన్నారట అంటూ సంపాదకీయాల్లో, ఎడిటోరియల్ కాలమ్స్ లో గ్యాసిప్ లు రాయడం ఆర్కేకు అలవాటే. అవును మరి ఇంతకీ తెలుగుదేశంలో చేరిన రెడ్డి, కాపుల గురించి ఆ పార్టీ కి చెందిన నాయకుడు ఎవరూ ఏ కామెంట్ ఆర్కే చేవిలో ఏవీ ఊదలేదా ః
మొత్తం మీద ఆర్కే ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే,
ఆంధ్రలో కమ్మవారికి-రెడ్లకు పడడం లేదు.
కమ్మవారికి పనులు జరగడం లేదు.
కమ్మవారికి బిల్లులు కావడం లేదు.
కమ్మవారికి పదవులు దక్కడం లేదు.
కమ్మవారికి ఆస్తులు అంటే పిచ్చి.
కమ్మవారు ఆస్తులు పెంచుకుంటారు.
మరి ఆర్కే ఇంతలా చెప్పిన తరువాత కమ్మ వారి ఆధీనంలో వున్న మీడియా చెప్పిన కబుర్లు, మీడియా అందించిన వార్తలు మిగిలిన వారు ఎందుకు నమ్మాలి? ఇదంతా కమ్మవారికి జరిగుతోంది అంటున్న, అనుకుంటున్న అన్యాయంపై వారు తమ తమ ఆధీనంలో వున్న మీడియా ద్వారా ఎత్తి పోస్తున్న అక్కుసు అక్షరాలు అని అనుకోవాలేమో కదా?