నితిన్ సినిమా ఛాన్స్.. 3 లక్షల రూపాయలే!

“ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాలో మీరు కనిపించాలనుకుంటున్నారా? ఏదో ఒక క్యారెక్టర్ లో మెరవాలనుకుంటున్నారా? అయితే మీరు జస్ట్ 3 లక్షలు కడితే చాలు. మీ కల మేం నెరవేరుస్తాం.” ఇలా ఓ వాట్సాప్…

“ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాలో మీరు కనిపించాలనుకుంటున్నారా? ఏదో ఒక క్యారెక్టర్ లో మెరవాలనుకుంటున్నారా? అయితే మీరు జస్ట్ 3 లక్షలు కడితే చాలు. మీ కల మేం నెరవేరుస్తాం.” ఇలా ఓ వాట్సాప్ గ్రూప్ ప్రత్యక్షమైంది. అందులో రోజురోజుకు సభ్యుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మేటర్ ఇప్పుడు సినిమా యూనిట్ వరకు వెళ్లింది.

తన దర్శకత్వంలో నితిన్ చేయబోయే భీష్మ సినిమాలో ఆఫర్ ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నాడు డైరక్టర్ వెంకీ కుడుముల. ఆ వాట్సాప్ గ్రూప్ కు సినిమా యూనిట్ తో ఎలాంటి సంబంధం లేదని డబ్బులిచ్చి మోసపోవద్దని సూచిస్తున్నాడు. నిజంగా అలాంటి అవకాశం ఉంటే యూనిట్ నుంచి కాస్టింగ్ కాల్ పిలుపు వస్తుందని, మధ్యవర్తుల్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నాడు.

భీష్మ సినిమా రోజురోజుకు లేట్ అవుతుండడం వల్లనే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని, సినిమా పిచ్చి ఉన్న కొందరు మోసపోతున్నారంటూ వస్తున్న కామెంట్లపై కూడా వెంకీ కుడుముల రెస్పాండ్ అయ్యాడు. మంచి అవుట్ పుట్ కోసం వెయిట్ చేయక తప్పదని చెప్పుకొచ్చాడు. త్వరలోనే నితిన్ సినిమా డీటెయిల్స్ రిలీజ్ చేస్తామంటున్నాడు.

చెన్నైలో వందమంది జూనియర్ ఆర్టిస్టులతో నితిన్ పై ఓ షెడ్యూల్ జరుగుతోందనే వార్తల్ని దర్శకుడు ఖండించాడు. అలాంటి షెడ్యూల్ ఏమీలేదని క్లారిటీ ఇచ్చాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది భీష్మ సినిమా. 

అనంతపురంలో వీళ్లు ఔట్?… కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు