సైరాలో బొమ్మాలి.. ఎంత వరకు నిజం?

చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాలో నయనతార మెయిన్ హీరోయిన్. మరో కీలకపాత్రలో తమన్న కూడా నటిస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి అనుష్క కూడా చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. అవును.. ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం…

చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాలో నయనతార మెయిన్ హీరోయిన్. మరో కీలకపాత్రలో తమన్న కూడా నటిస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి అనుష్క కూడా చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. అవును.. ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం అనుష్కను తీసుకున్నారట. స్వయంగా రామ్ చరణ్ సంప్రదింపులు జరిపి అనుష్కను ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇది కేవలం పుకారుకే పరిమితం అంటున్నారు చాలామంది. ఎందుకంటే ప్రత్యేక పాత్రలు చేసే మూడ్ లో లేదు అనుష్క. తనకంటూ సొంతంగా మార్కెట్ ఉంది. పైగా ఆల్రెడీ ఓ సినిమాలో నటిస్తోంది. ఇలాంటి టైమ్ లో సైరాలో గెస్ట్ రోల్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు.

అన్నింటికీ మించి అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించాలంటే అది కచ్చితంగా నాగార్జున సినిమా అయి ఉండాలి. ఈమధ్య కాలంలో అనుష్క ఇదేఫార్ములా ఫాలో అవుతోంది. సో.. ఆమె చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో కనిపించడం జరిగే పనికాదు.

కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి సరసన ఓ స్పెషల్ సాంగ్ చేసింది అనుష్క. మళ్లీ చిరు సరసన నటించే ఛాన్స్ రాలేదు. సైరా రూపంలో ఇన్నాళ్లకు ఆమెకు ఛాన్స్ వచ్చిందంటున్నారు. కానీ ఇది కూడా డౌటే.

అనంతపురంలో వీళ్లు ఔట్?… కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు