మహర్షి లీకులు మొదలు

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తయారవుతోంది మహర్షి సినిమా. ఏప్రెల్ నెలాఖరులో విడుదల. అయితే సినిమాకు ఇప్పటిదాకా సరైన బజ్ అయితే లేదు. పైగా బడ్జెట్ అంతకు అంతకూ పెరుగుతోంది. సినిమా మార్కెట్…

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తయారవుతోంది మహర్షి సినిమా. ఏప్రెల్ నెలాఖరులో విడుదల. అయితే సినిమాకు ఇప్పటిదాకా సరైన బజ్ అయితే లేదు. పైగా బడ్జెట్ అంతకు అంతకూ పెరుగుతోంది. సినిమా మార్కెట్ కు సమస్య ఏమీలేదు కానీ, బజ్ బాగా వస్తే కానీ ఫ్యాన్సీ రేట్లు రావు. పెట్టిన పెట్టుబడికి, ముగ్గురు నిర్మాతలు లాభాలు పంచుకోవడానికి వీలయినంత మార్కెట్ కావాల్సి వుంది. పైగా భరత్ అనే నేను బయటకు వచ్చిన అంకెలు వేరు. వాస్తవపు అంకెలు వేరు. అసలు అంకెలు బయ్యర్లకు తెలుసు. 

అందుకే ఇప్పుడు సినిమాకు బజ్ పెంచే ప్రయత్నం మొదలైంది. మహేష్ వ్యవహారాలు అన్నీ చక్కబెట్టే నమ్రత టీమ్ నుంచి లీకులు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరో.. హీరోయిన్లు హగ్ చేసుకున్న స్టిల్ ఒకటి ఈరోజు వున్నట్లుండి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. 

మరో రెండు నెలలకు పైగానే వుంది విడుదలకు. కానీ ఇప్పటి నుంచీ ఇలా పిక్స్ వదులుతూ వుండకపోతే సినిమా మీద బజ్ పెరగడం, మాంచి మార్కెటింగ్ అన్నది సాధ్యంకాదు. అందువల్ల ఈ కోవలో మరిన్ని చిత్రాలు త్వరలో దర్శనం ఇస్తాయేమో?

వైసీపీ వీటిని పట్టించుకోకపోవడం వారికే మేలు!

వినయ విధేయ, మజ్ను, పేటా కలిసి పోగొట్టుకున్నవే 70 కోట్లకు పైగా