స్పీడుమీదున్నారు సుకుమార్

డైరక్టర్ సుకుమార్ చాలా స్పీడ్ గా వున్నారు. అయితే తను మహేష్ తో చేయబోయే సినిమా మీద కాదు. తన అసిస్టెంట్ లను డైరక్టర్లను చేయడంలో. సరైన స్క్రిప్ట్ లు తయారుచేయిస్తూ, ప్రాజెక్టులు డిజైన్…

డైరక్టర్ సుకుమార్ చాలా స్పీడ్ గా వున్నారు. అయితే తను మహేష్ తో చేయబోయే సినిమా మీద కాదు. తన అసిస్టెంట్ లను డైరక్టర్లను చేయడంలో. సరైన స్క్రిప్ట్ లు తయారుచేయిస్తూ, ప్రాజెక్టులు డిజైన్ చేసి, అన్నీ తానే సెట్ చేసి, ఎవరో ఒక నిర్మాతను చూసి, ఆయన చేతిలో ప్రాజెక్టు వుంచుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్ జోడించి, హ్యాపీగా తన వాటా తాను తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఓ ప్రాజెక్టును మైత్రీమూవీస్ లో సెట్ చేసారు. మరోటి గీతాలో వుంది. నితిన్ హీరోగా. అది స్టార్ట్ కావాల్సి వుంది. ఇప్పుడు ఇంకోటి నాగశౌర్య హీరోగా తన అసిస్టెంట్ కాశీ విశాల్ డైరక్షన్ లో సెట్ చేసారు. ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాత. ఆయన తన నార్త్ స్టార్ పతాకంపై దీనిని నిర్మిస్తారు.

మొత్తంమీద చాలారోజుల తరువాత శరత్ మరార్ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే నాగశౌర్య కూడా నర్తనశాల తరువాత హీరోగా సినిమా చేయబోతున్నారు. 

అవకాశవాది! ప్రజలు ఏమనుకుంటారనే భయమే లేదు!

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట