అక్కినేని అఖిల్ తో డైరక్టర్ క్రిష్ సినిమా. ఓ న్యూస్ డైలీలో పుట్టిందీ వార్త. అక్కడి నుంచి వెబ్ సైట్లలోకి పాకింది. అసలు విషయం తెలిసిన వారు ఈ గాలి వార్త తెలిసి నవ్వుకున్నారు. కానీ అసలు వ్యక్తి అయిన డైరక్టర్ క్రిష్ మాత్రం షాక్ అయినట్లు బోగట్టా. ఎందుకంటే ఆయనకు కనీసపు ఆలోచన కూడా లేదు అఖిల్ తో సినిమా అన్నది.
వాస్తవానికి బయోపిక్ తరువాత ఏం చేయాలన్నది ఇంకా క్రిష్ డిసైడ్ చేసుకోలేదు. బన్నీతో క్రిష్ కు మాంచి సాన్నిహిత్యం వుంది. అక్కడ ఓపెన్ ఆఫర్ వుంది. కానీ ఇంకా ఏం చేయాలి? ఎవరికి చేయాలి? అన్నది కనీసం డిస్కషన్ కూడా లేదు. పైగా నాగ్ తో మాట్లాడడం కానీ, నాగ్ ను కలవడం కానీ జరగలేదని క్రిష్ సన్నిహిత వర్గాల బోగట్టా.
మరి అలాంటిది క్రిష్-అఖిల్ జోడీ అన్న వార్త ఎలా పుట్టింది? ఎందుకు పుట్టించారు? ఎవరు పుట్టించారు? కేవలం మిస్టర్ మజ్ఞు సినిమాకు కాస్త బజ్ తీసుకురావడం కోసం ఇది పుట్టించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైతేనేం క్రిష్ వర్గాల నుంచి మాత్రం క్లారిటీ వచ్చేసింది. అఖిల్ తో సినిమా అన్న ప్లానింగ్ నే లేదు అని. అదీ సంగతి.