మరీ ఇంత బోల్డ్ నా.. బాబోయ్

రాను రాను తెరమీదకు అన్నీ వచ్చేస్తున్నాయ్. డబుల్ మీనింగ్ పోయి డైరక్ట్ మీనింగ్ లు, పచ్చి శృంగార సన్నివేశాలు, తరచు కనిపిస్తూనే వున్నాయ్.. వినిపిస్తూనే వున్నాయ్. అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటూ మన సినిమాలు…

రాను రాను తెరమీదకు అన్నీ వచ్చేస్తున్నాయ్. డబుల్ మీనింగ్ పోయి డైరక్ట్ మీనింగ్ లు, పచ్చి శృంగార సన్నివేశాలు, తరచు కనిపిస్తూనే వున్నాయ్.. వినిపిస్తూనే వున్నాయ్. అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటూ మన సినిమాలు కొంచెం బెటరే అనుకుంటూ వస్తున్నాం ఇన్నాళ్లూ. ఇప్పుడు ఆ చింత తీరిపోయింది. 

చీకటికొట్లో చితక్కొట్టుడు అనే సినిమా వస్తోంది. బహుపరాక్. సూపర్ డూపర్ సినిమా. పోర్నోకు తక్కువ. శృంగారానికి ఎక్కువ అన్నట్లు వుంది ట్రయిలర్ చూస్తుంటే. ట్రయిలర్ ఓపెన్ అయ్యాక, నీడల్లో చూపించిన రెండో షాట్ నే టోటల్ సినిమాకు పరాకాష్టలా కనిపిస్తోంది. మిగిలిన సీన్లు దానికి తగినట్లే వున్నాయి. 

డైలాగులు కూడా తామేం తక్కువ తినలేదు అన్నట్లు వినిపించాయి. ఈ  డైలాగులు, ఈ సీన్ల నడుమ సినిమాలో నటులు ఎవరో? అమ్మాయిలు ఎవరో? ఎవరికీ పట్టదు అనుకోండి. అది వేరే సంగతి. ట్రయిలర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే, సినిమాకు కూడా సెన్సారు ఉదారంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, బి సి సెంటర్లలో కుర్రకారు థియేటర్ల దగ్గర బారులు తీరడం ఖాయం.