సినిమాలు తగ్గిపోయాయి. ఫిబ్రవరి, మార్చిల్లో వెదికి వెదికి సినిమాలు చూడాల్సిన పరిస్థితి ఆడియన్స్ కు వస్తోంది. అందువల్ల పోటీలేదు. మూడేసి, నాలుగేసి ఒక్కసారి కుమ్మేసుకోవడం లేదు. ఫిబ్రవరి నెలలో అన్నీ సోలో విడుదలలే. బాగుంటే అదృష్టం. మంచి నెంబర్లు వస్తాయి. లేదంటే లేదు.
ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వైఎస్ఆర్ మీద తీసిన యాత్ర సినిమా విడుదలకు రెడీ అవుతోంది. దీనికి పోటీగా దాదాపు ఏ సినిమా లేనట్లే.
ఫిబ్రవర్ సెకెండ్ వీక్ లో కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ ల రోమ్ కామ్ టైప్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.ఈ సినిమాకు కూడా పోటీ వుండకపొవచ్చు.
ఆ తరువాత వారం ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 విడుదలయ్యే అవకాశం వుంది. దానికి కూడా పోటీ వుండదు. వుంటేగింటే ప్రేమకథాచిత్రమ్ పార్ట్-2 వుండొచ్చు.
మార్చి ఫస్ట్ 1న మాత్రం రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. కళ్యాణ్ రామ్ 118, అల్లుశిరీష్ ఎబిసిడి సినిమాలు ఒకేరోజు విడుదలయ్యే అవకాశం వుంది.
మళ్లీ మార్చి నెలాఖరు వరకు సినిమాలు లేనట్లే. నీహారిక కొణిదెల సూర్యకాంతం సినిమా ఒక్కటే ప్రస్తుతానికి షెడ్యూలు అయివుంది.
ఏప్రియల్ వస్తే కానీ బాక్సాఫీస్ కు ఫుల్ ఫీవర్ అందుకోదు.