అక్కినేని హీరోలకు ‘మాస్’ ఎందుకు పడదు?

ఎన్టీఆర్ ని చూసి మాస్ నేర్చుకో.. మిస్టర్ మజ్ను సినిమా ఫంక్షన్లో అఖిల్ కు నాగార్జున చేసిన హితబోధ ఇది. అలా ఎందుకు చెప్పాడో సినిమా విడుదలైన తర్వాత అఖిల్ కు బాగా అర్థమైంది.…

ఎన్టీఆర్ ని చూసి మాస్ నేర్చుకో.. మిస్టర్ మజ్ను సినిమా ఫంక్షన్లో అఖిల్ కు నాగార్జున చేసిన హితబోధ ఇది. అలా ఎందుకు చెప్పాడో సినిమా విడుదలైన తర్వాత అఖిల్ కు బాగా అర్థమైంది. మిస్టర్ మజ్ను లాంటి సాఫ్ట్ స్టోరీలకు ఓపెనింగ్స్ తక్కువే. సినిమా భారీ హిట్ అయ్యి, మౌత్ టాక్ బ్రహ్మాండంగా వస్తే తప్ప థియేటర్లలో నిలవడం కష్టం. వినయ విధేయరామ వంటి యాక్షన్ మూవీస్.. నెగెటివ్ టాక్ వచ్చేలోపే కలెక్షన్లు దులిపేసుకుంటాయి. అందుకే కొడుక్కి మాస్ మంత్రం చెబుతున్నాడు నాగార్జున.

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. నలుగురు టాప్ హీరోలుగా వెలిగిన రోజుల్లో రికార్డ్ ల యుద్ధం చిరంజీవి, బాలకృష్ణ మధ్యే జరిగేది. 50డేస్ సెంటర్లు, 100రోజుల సెంటర్లలో పోటా పోటీ ఉండేది. వెంకటేష్ స్టడీగా ఫ్యామిలీ హిట్స్ తో దూసుకెళ్తుంటే, నాగార్జున తనదైన రొమాంటిక్ కథలతో అలరించేవాడు. మాస్ ట్రై చేసినా మిగతా ముగ్గురిలాగా ఎందుకో నాగార్జునకి అది వంటబట్టలేదు. మంచి దర్శకులు పడితేనే నాగ్ కు మాస్ హిట్స్ దొరికేవి. లేదంటే లేదు.

ఇప్పుడు జనరేషన్ మారింది. మెగా ఫ్యామిలీ హీరోలు మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేశారు. రామ్ చరణ్, అల్లుఅర్జున్ క్లాస్-మాస్ అనే తేడా లేకుండా దూసుకెళ్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కి మాస్ హిట్సే ఎక్కువ. దగ్గుబాటి ఫ్యామిలీలో రానా హీరో, విలన్ అనే తేడా లేకుండా జర్నీ చేస్తున్నాడు. రానాకి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది.

ఇక మిగిలింది అక్కినేని ఫ్యామిలీ. అప్పట్లో నాగార్జునకు సాధ్యం కాని ఫీట్.. ఇప్పుడు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కి కూడా సాధ్యంకావడం లేదు. నాగచైతన్యకి మాస్ సినిమాలు వర్కవుట్ కావని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మాస్ మూవీ చేసిన ప్రతిసారి బొక్కబోర్లాపడ్డాడు చైతూ. అందుకే తనకి తగ్గ జానర్ లోకి వెళ్లిపోయాడు.

ఇక అఖిల్ మూడు సినిమాలతో మూడు పాఠాలు నేర్చుకున్నాడు. తన లవర్ బోయ్ పర్సనాల్టీకి లవ్ స్టోరీలే బెటరని అఖిల్ కూడా డిసైడ్ అయ్యాడు కానీ నాగార్జునకి మాత్రం కొడుకుని మాస్ హీరోలా చూడాలని ఉంది. నాగ్ కు అంతంత మాత్రంగానే కలిసొచ్చిన మాస్ ఫార్ములా, చైతూకు బొత్తిగా అచ్చిరాని మాస్ ఫార్ములా.. అఖిల్ కైనా కలిసొస్తుందా..?

అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ

ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?