సాధారణంగా పూరి జగన్నాధ్ హీరోయిన్లు వెదికి వెదికి పట్టుకువస్తారు. మరీ పెద్ద హీరోలు అంటే పవన్, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి వాళ్ల పక్కన తప్ప, మీడియం హీరోలు అంటే ఆయన ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్లు వెదికి తెస్తారు. అయితే ఫర్ ఏ ఛేంజ్ ఈసారి హీరో రామ్ పక్కన కొత్తవాళ్లకు బదులు ఆల్రెడీ ఒకటి రెండు సినిమాల్లో వేసిన వారినే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ సినిమా అంటే రామ్ తో పాటు స్రవంతి రవికిషోర్ కూడా కేర్ తీసుకుంటారు. అంత సులువుగా పనులు ఒకే కావు. అందుకే కొత్త అమ్మాయిలు అన్నదాన్ని వీటో చేసి, ఆల్రెడీ కొన్ని సినిమాల్లో వేసిన నిథి అగర్వాల్, నిభా వెంకటేష్ లను తీసుకుంటున్నారని టాక్.
ఈ ఇద్దరూ కూడా ఫ్లాప్ సినిమాల హీరోయిన్లే. నిధి అగర్వాల్ చూడడానికి బాగానే వుంటుంది కానీ, పెద్దగా నటనకు పనికిరాదని, సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు ప్రూవ్ చేసేసాయి. అలాగే నభా వెంకటేష్ గతంలో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాలో నటించింది.
ఇక్కడ పూరికి ఒకటే ఈక్వేషన్ అయి వుండాలి. కొత్త వాళ్లు అయితే బడ్జెట్ ఫ్రీ. ఇప్పుడు ఈ ఇద్దరు అయినా ఫ్లాప్ హీరోయిన్లు కాబట్టి, పెద్దగా బడ్జెట్ పెట్టక్కరలేదు. పైగా సినిమా సమ్మర్ కు విడుదల అంటే కొత్త వాళ్లను వెదకడానికి టైమ్ పడుతుంది. అందుకే ఇవన్నీ చూసి పూరి ఈ మార్పుకు ఓకె చేసి వుంటారు.
అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ
ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?