నానితో సినిమా అంటే..

రాను రాను మీడియం హీరోలు కూడా రేట్లు పెంచుతున్నారు. మినిమమ్ గ్యారంటీ హీరోలు, నాని, శర్వా, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు గతంలో నాలుగయిదు కోట్లలో వుంటే ఇప్పుడు తొమ్మిది కోట్లకు చేరిపోయారు. నాని ఆ…

రాను రాను మీడియం హీరోలు కూడా రేట్లు పెంచుతున్నారు. మినిమమ్ గ్యారంటీ హీరోలు, నాని, శర్వా, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు గతంలో నాలుగయిదు కోట్లలో వుంటే ఇప్పుడు తొమ్మిది కోట్లకు చేరిపోయారు. నాని ఆ మధ్య దేవదాస్ సినిమాకు తొమ్మిదికోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా విక్రమ్ కుమార్ సినిమాకు కూడా నాని రెమ్యూనిరేషన్ అదే.

అయితే జెర్సీ సినిమాకు మాత్రం కథ నచ్చి, రెమ్యూనిరేషన్ లేకుండా, లాభాల్లో సగం వాటా తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు బోగట్టా. లేటెస్ట్ గా గీతా-యువి కలిసి నానితో ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నాని నుంచి మళ్లీ అదే డిమాండ్ వుంటుంది.

నానికి తొమ్మిది కోట్లు ఇచ్చి, డైరక్టర్ గా మారుతికి అయిదు కోట్లు ఇచ్చి, స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ చూసుకంటే అక్కడికే ఇరవై కోట్లు దాటేస్తుంది. ఇక మేకింగ్, పబ్లిసిటీ అన్నీ చూసుకుంటే 35 కోట్ల పైమాటే. కానీ నాని సినిమాలు అంత లెవెల్లో పే చేయడం కష్టం.

అందుకే ఈ వ్యవహారం ముందు వెనుకల్లో నలుగుతోందని బోగట్టా. అంతకన్నా జెర్సీ మాదిరిగా లాభాల్లో వాటా తీసుకుంటేనే నిర్మాతకు మంచిదేమో?

అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ

ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?