వరుణ్ తేజ్ త్వరలో అమెరికా వెళ్తున్నారు. అక్కడ ట్రయినర్ సాయంతో జిమ్ లో కష్టపడి మరింత బాడీ బిల్డ్ చేయడానికి అని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి హైట్, వెయిట్ లో ఇప్పటికే వరుణ్ పెర్ ఫెక్ట్ గా వున్నాడు. వాస్తవానికి కొంచెం తగ్గితేనే బెటర్ అనే టాక్ కూడా వుంది.
హైట్ వున్నాడు కాబట్టి సరిపోతోంది కానీ లేదూ అంటే వరుణ్ నడుం కిందిభాగం కాస్త భారీనే. అయితే క్లోజ్ లు, బాగున్న యాంగిల్స్ ఇలా రకరకాల సినిమా, కేమేరా జిమ్మిక్స్ తో కవర్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనో మరింత బాడీ పెంచితే ఇబ్బంది అవుతుందేమో అన్నది వరుణ్ గమనించాలి.
ప్రస్తుతం 14రీల్స్ సంస్థ సినిమా, ఆ తరువాత గీతాసంస్థలో కొత్త దర్శకుడు కిరణ్ సినిమా చేయాల్సి వుంది. హిట్ ట్రాక్ లో వున్న వరుణ్ ఫిజిక్ మీద దృష్టిపెట్టి, సరైన దోవలో వెళ్లడం అవసరం.
అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ
ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?