రికార్డులు ఎగిపోవడం పక్కా

తెలుగునాట, వరల్డ్ వైడ్ గా తెలుగులో విడుదలయిన చోట్ల ఎఫ్ 2 సినిమా కుమ్ముడే కుమ్ముడు. తెలుగు రాష్ట్రాల్లో 15 రోజులకు 56 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 69…

తెలుగునాట, వరల్డ్ వైడ్ గా తెలుగులో విడుదలయిన చోట్ల ఎఫ్ 2 సినిమా కుమ్ముడే కుమ్ముడు. తెలుగు రాష్ట్రాల్లో 15 రోజులకు 56 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 69 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు ఇక రికార్డుల మీదకు వెళ్తుంది వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 2 కనుక మరో నాలుగు కోట్లు ఇవ్వాళ (సండే) రేపు కలెక్షన్లు సాధిస్తే, జైలవకుశ, జనతాగ్యారేజ్, దువ్వాడ జగన్నాధమ్, అత్తారింటికి దారేది, సరైనోడు, శ్రీమంతుడు రికార్డులు ఎగిరిపోతాయి. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 8 ప్లేస్ లోకి వెళ్లిపోతుంది ఎఫ్ 2, 

ఈ రికార్డు కష్టమేమీకాదు. ఎందుకంట సండే కచ్చితంగా రెండుకోట్లకు పైగానే వుంటుంది కలెక్షన్. అందువల్ల సులువుగా మంగళవారం నాటికి 60 కోట్ల షేర్ వచ్చేస్తుంది. మరో కోటిరూపాయలు జోడిస్తే మగధీర కూడా దాటుతుంది. కానీ అంతకు మించి వెళ్లే అవకాశం వుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే టాప్ 5 లోకి చేరాలంటే 67 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. ఆ ఫీట్ వస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతానికి అయితే టాప్ 7లోకి వస్తుంది. టాప్ 7లో బన్నీ సినిమానే లేదు.

వరల్డ్ వైడ్ గా..
వరల్డ్ వైడ్ గా 15 రోజులకు 69 కోట్ల వరకు వచ్చింది. మరో అయిదు కోట్లు వచ్చి 74 కోట్లకు చేరుకుంటే, అక్కడా మగధీరను క్రాస్ చేసి టాప్ 10లో చోటు దక్కించుకుంటుంది. టాప్ టెన్ లో కూడా బన్నీ సినిమా లేకపోవడం విశేషం.

నైజాంలో..
సినిమా నైజాంలో బలంగా వుంది. ఇప్పటికే  19.5 కోట్లు సాధించింది. నైజాంలో బన్నీ దువ్వాడ జగన్నాధమ్ 20.20 కోట్లతో టాప్ 10లో తొమ్మిదో ప్లేస్ లో వుంది. సండేతో ఆ రికార్డు పక్కకు వెళ్తుంది. గీతగోవిందం రికార్డును ఇప్పటికే దాటేసింది. 23.5 కోట్లు వస్తే కనుక నైజాంలో టాప్ 5లో ఎఫ్ 2 వుంటుంది. ఆ టాస్క్ పెద్ద కష్టంగా అయితే అనిపించడం లేదు. ఎందుకంటే సండే తోనే 21కి చేరువ అవుతుంది. మరో రెండున్నర కోట్లు ఈ వారంలో సులువుగా సాధిస్తుంది.

మొత్తంమీద వరల్డ్ వైడ్ గా ఎపి, తెలంగాణలో టాప్ 10లో, నైజాంలో, ఇంకా చాలా ఏరియాల్లో టాప్ 5 లోకి చేరి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఎఫ్ 2. క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి.

అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ

ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?