అఖిల్ ముచ్చటగా మూడు సినిమాలు చేసాడు. తొలి సినిమా అఖిల్ తో నిర్మాత నితిన్ దారుణంగా నష్టపోయాడు. రెండో సినిమా హలో స్వంత బ్యానర్ పైనే. అయినా దానికి కూడా నష్టాలు తప్పలేదు నిర్మాత నాగార్జునకు. ఈ లెక్కల్లో చూసుకుంటే మూడో సినిమా మజ్ఞు కాస్త బెటర్ అనుకోవాలి.
మజ్ఞు సినిమా ఫెర్ ఫార్మెన్స్ వైజ్ గా, యావరేజ్ టాక్ వైజ్ గా మిగిలిన రెండు సినిమాలకన్నా బెటర్ అన్నమాట వినిపించడం అలా వుంచితే, ప్రొడక్షన్, సేల్స్ వైజ్ గా బెటర్ ప్రొడెక్ట్ అనేచెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు అన్నీకలిపి 26 నుంచి 27 కోట్ల వరకు ఖర్చయింది. అఖిల్, హలో సినిమాలు బడ్జెట్ మజ్ఞు కన్నా ఎక్కువ.
ఇక మజ్ఞు సేల్స్ చూసుకుంటే సీడెడ్ రెండున్నర కోట్లకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఓవర్ సీస్ రైట్స్ మూడున్నర కోట్లకు విక్రయించారు. శాటిలైడ్ డిజిటల్ అన్నీకలిపి 12 కోట్ల వరకు వచ్చాయి. ఉత్తరాంధ్ర 2 కోట్లకు రికవరబుల్ అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, నెల్లూరు కలిపి నాలుగున్నర కోట్లకు పైన వచ్చింది.
నైజాం, గుంటూరు కలిపి రెండున్నర కోట్ల బర్డెన్ వుండిపోయింది నిర్మాతకు. నైజాం రెండు రోజులకు రెండుకోట్లు, గుంటూరు రెండు రోజులకు 73 లక్షలు వచ్చింది. అంటే బర్డెన్ తీరిపోయినట్లే. నిర్మాత సేఫ్ అయిపోయినట్లే.
ఇక బయ్యర్లు సేఫ్ కావాలి. ఉత్తరాంధ్ర రెండు రోజులకు 73లక్షలు వచ్చింది. సండేతో కలిపితే కోటి దాటేస్తుంది. అంటే మరో సగం రికవరి కావాలి. మిగిలిన ఏరియాలు అన్నీ కూడా ఇదే రీతిగా వున్నాయి. ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు సగం రికవరీ అయ్యే దిశగానే వున్నాయి.
ఫస్ట్ వీక్ లో కాకుండా, సెకండ్ వీక్ లో అయినా పదిశాతం అటు ఇటుగా బయ్యర్లు తమ డబ్బులు రాబట్టుకోవగలిగితే అఖిల్ మూడో సినిమా ఆ విధంగా బెటర్ ప్రొడెక్ట్ అనిపించుకుంటుంది. అయితే యాత్ర సినిమా వచ్చేవరకు థియేటర్లలో సినిమా లేకపోవడం అదృష్టం. ఎఫ్ 2 సినిమా దూకుడు అస్సలు ఏమాత్రం తగ్గకపోవడం మజ్ఞు దురదృష్టం.
అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ
ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?