తిరుమల దర్శనాలు నిలిపివేత

కరోనా ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యల్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఆన్…

కరోనా ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యల్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఆన్ లైన్ లో తీసుకున్న టిక్కెట్లను రద్దు చేశారు. కొండపైకి భక్తులు రాకుండా అలిపిరి టోల్ గేట్ ను మూసేశారు. మరోవైపు నడకదారిని కూడా క్లోజ్ చేశారు.

నిజానికి దర్శనాలు ఆపకూడదని ముందుగా అనుకుంది టీటీడీ. ఈ మేరకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తి చెప్పి, టైమ్ స్లాట్ ద్వారా క్యూ లైన్లో ఎక్కడా ఆగకుండా నడుస్తూ వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. అయితే కరోనా మరింత విస్తరించడంతో ఇది కూడా శ్రేయస్కరం కాదని భావించి, ఏకంగా దర్శనాల్నే రద్దు చేసింది పాలకమండలి.

ప్రస్తుతం కొండపై అతి తక్కువ మంది భక్తులు మాత్రమే ఉన్నారు. వాళ్లను కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల కల్లా కొండ కిందకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే దర్శనాలు నిలిపివేసినా దేవదేవునికి జరగాల్సిన పూజలు, సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.

మరోవైపు కరోనాపై ముఖ్యమంత్రి జగన్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే విద్యాసంస్థలకు శెలవులు ప్రకటించడంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నట్టు తాము విదేశాల నుంచి వచ్చే ప్రాయాణికుల్ని వదిలేయడం లేదని స్పష్టంచేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. సీఎంతో రివ్యూ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అవంతి.. అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటు విశాఖ నౌకాశ్రయానికి వచ్చిన 59 విదేశీ నౌకల్లోని సిబ్బందికి కూడా పరీక్షలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై తీరానికి రాకముందే నౌకల్లో సిబ్బందికి కరోనా స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు.

నమస్కారం మన సంస్కారం

వరుణ్ తేజ్ లో కూడా 'వరుణ్' ఉంది