ఈసీపై హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకో?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాణభయంతో కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారంటూ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా ఉంది. దీనిమీద కందకు లేని దురదను కత్తిపీటలు ప్రదర్శిస్తున్నాయి. అసలు హోంశాఖకు అందిన…

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాణభయంతో కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారంటూ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా ఉంది. దీనిమీద కందకు లేని దురదను కత్తిపీటలు ప్రదర్శిస్తున్నాయి. అసలు హోంశాఖకు అందిన లేఖ ఎవరిపేరుతో అయితే ఉన్నదో వారు మాత్రం స్పందించడం లేదు. మౌనంగా ఉంటూ చోద్యం చూస్తున్నారు. కానీ.. వర్తమాన రాజకీయాల్లో ఠికానా లేని అరటికెట్ నాయకులందరూ కలిసి.. ఈ లేఖ మీద రాద్ధాంతం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని ఎవరైనా ఆరోపణ చేసుకోవచ్చు. అలాంటి ఫిర్యాదు చేయడం, పోలీసు రక్షణ కోరడం, పితూరీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కనుక.. కేంద్ర హోంశాఖ రక్షణ కోరడం.. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. సదరు వ్యక్తి స్పష్టంగా తాను ఆ లేఖ రాసినట్లుగా చెప్పడం లేదు. ఆ లేఖ ఎవరో నకిలీ వ్యక్తులు రాసి… నిమ్మగడ్డ రమేష్ అనే మెయిల్ ఐడీ ద్వారా పంపి ఉండవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది.

అసలు ఆ లేఖ నిజమో కాదో ఇసుమంతైనా తేలకపోయినప్పటికీ… ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాస్త వార్తల్లో కనిపించవచ్చునని ఆరాటపడే సెకండ్ గ్రేడ్ రాజకీయ నాయకులు దీనిని చాలా మంచి తరుణంగా భావించినట్లున్నారు. అసలు  ఎవరి ప్రాణాలకు రక్షణ లేదని సదరు ఉత్తరంలో ఉన్నదో.. ఆయన నోరు మెదపలేదు.. ఆయన ప్రాణాల్ని కాపాడి తీరాల్సిందేనంటూ… పనిలేని నాయకులందరూ కలసి కంకణం కట్టుకుని, గొంతు చించుకుంటున్నారు.

రమేష్ కుమార్ కు భద్రత పెంచాలంటూ సీపీఐ ఒక ప్రకటన చేసింది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల పర్వంలో కొన్నిచోట్ల అల్లర్లు జరిగిన మాట వాస్తవమే కావొచ్చు. వైకాపా కార్యకర్తలే అల్లర్లకు పాల్పడి ఉండొచ్చు. కానీ.. వారు ఈసీ  మీద ఎందుకు పగబడతారు? ఎటూ నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయాక, ఎన్నికల ప్రక్రియకు వచ్చిన నష్టమేమీ లేదు కదా. పోటీకి దిగిన వారు గెలవకుండా పోయేదేమీ లేదు కదా..? అయినా సరే.. ఈ పరిణామాల ఈసీకి ప్రాణభయం ఉన్నదని రంగు పులమడానికి.. ఈ ఎన్నికల్లో సోదిలో కూడా లేని సీపీఐ ఆరాటపడుతోంది. వీరి ప్రయత్నం మొత్తం చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నదనే అభిప్రాయాలు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి.

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారు. సీఈసీ భద్రత పెంచాలని ఆయన కోరుతున్నారు. చంద్రబాబు మనసులో మాట గ్రహించి.. వీరంతా ఇలా యాగీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వరుణ్ తేజ్ లో కూడా 'వరుణ్' ఉంది

జ‌‘గ‌న్’ మిస్ ఫైర్ అవుతున్న‌దెక్క‌డ‌?