ఆన్ లైన్ టికెట్ ల అమ్మకం ఎమ్.ఓ.యు ల విషయం సీరియస్ ఇస్యూగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జనాలకు తెలియకుండానే జనం దగ్గర నుంచి టికెట్ కు పది రూపాయలు అదనంగా లాగుతూ వస్తున్నారు ఎగ్జిబిటర్లు చిరకాలంగా.
ఆన్ లైన్ బుకింగ్ లపై సర్వీస్ చార్జి పేరిట భారీగా వసూలు చేస్తూ, అందులో మళ్లీ ఎగ్జిబిటర్లకు వాటా ఇస్తున్నారు. ఇది కాక ఎగ్జిబిటర్లకు భారీగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. థియేటర్ రిన్నోవేట్ చేసినపుడల్లా ఇలాంటి రుణాలు అందుకుంటున్నారు.
అందువల్ల అన్ని విధాలా లాభదాయకంగా వున్న ప్రస్తుత విధానం నుంచి ప్రభుత్వ ఆన్ లైన్ విధానంలోకి మారేందుకు ఎగ్జిబిటర్లు అస్సలు ఇష్టపడడం లేదు. ఈ లోగా ఇప్పటికే వున్న సర్వీసు ప్రొవైడర్లు లీగల్ ఫైట్ కు సిద్దమయ్యారు. ఈ విషయమై సోమవారం నాడు కోర్టు నుంచి స్టే వస్తుందని ఆశిస్తున్నారు.
ఒక వేళ అలా రాకపోతే ఏం చేయాలన్నది సమస్య. ఈ నేపథ్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు ఈ రోజు అమలాపురంలో సమావేశం అయ్యారు. సోమవారం వరకు వేచి వుండి, లీగల్ గా ఉపశమనం లభించని పక్షంలో థియేటర్ బంద్ పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు తెలుస్తోంది.