విజయ్ బైక్ కథేమిటి?

విజయ్ దేవరకొండ.. టాక్సీవాలా తరువాత డియర్ కామ్రేడ్ ఆల్ మోస్ట్ ఫినిష్ చేసేసారు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు సినిమా టైమ్ వచ్చింది ఇప్పుడు. ఆ తరువాత ప్రాజెక్టు ఏమిటి? అంటే…

విజయ్ దేవరకొండ.. టాక్సీవాలా తరువాత డియర్ కామ్రేడ్ ఆల్ మోస్ట్ ఫినిష్ చేసేసారు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు సినిమా టైమ్ వచ్చింది ఇప్పుడు. ఆ తరువాత ప్రాజెక్టు ఏమిటి? అంటే కాస్త ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి ఒకె చేసి పెట్టాడని వినిపిస్తోంది.

నిజానికి విజయ్ దేవరకొండకు బోలెడు డిమాండ్ వుంది ఇప్పుడు. అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నోటా సినిమా కొన్ని పాఠాలు కూడా నేర్పిందాయె. అందుకే సినిమా సినిమాకు కేవలం వైవిధ్యం వుండడమే కాకుండా, తనకు నప్పేవి, జనం మెచ్చేవి అయిన జోనర్లను ఎంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో క్రాంతి మాధవ్ సినిమా తరువాత చేయడం కోసం ఓ డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఓ బైక్ చుట్టూ తిరిగే కథ ఏదో తమిళ దర్శకుడు ఒకరు తెచ్చారట. ఆ సబ్జెక్ట్ ఇంప్రెస్ చేయడంతో దాన్ని ఓకె చేసి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కేఎస్ రామారావు-

క్రాంతి మాధవ్ సినిమా అయ్యేలోగా మరేదైనా ఇంట్రస్టింగ్ పాయింట్ దగ్గరకు వస్తే ఆ సినిమా చేయాలని, లేదూ అంటే ఈ బైక్ సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తరవాత మళ్లీ మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. కొరటాల శివ లేదా మరోకరు డైరక్టర్ కావచ్చని వినికిడి.

జగన్, కేసీఆర్ కలయిక పరిణామం ఆంధ్రాలో ఎలా ఉండబోతోంది బిగ్ స్టోరీ 

సెక్సీ కామెంట్స్ః మగాళ్లు హద్దుల్లో ఉండాలిక!