డ్యామేజీ ‘కంట్రోల్‌’ అవుతుందా హన్సికా.?

హీరోయిన్‌ హన్సిక ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. 'ప్రైవేట్‌' ఫొటోలు బయటకు ఎలా వచ్చాయి.? అంటే, దానికి సమాధానంగా మొన్నీమధ్యనే అక్షర హాసన్‌ ఫొటోలు లీకైన ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు కొందరు. హన్సిక…

హీరోయిన్‌ హన్సిక ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. 'ప్రైవేట్‌' ఫొటోలు బయటకు ఎలా వచ్చాయి.? అంటే, దానికి సమాధానంగా మొన్నీమధ్యనే అక్షర హాసన్‌ ఫొటోలు లీకైన ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు కొందరు. హన్సిక మోత్వానీ కూడా చివరికి ఇదే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందనీ, ట్విట్టర్‌ని కూడా హ్యాక్‌ చేశారనీ, ప్రస్తుతం 'బ్యాక్‌ హ్యాండ్‌' (అది బ్యాక్‌ హ్యాండ్‌ కాదు, బ్యాక్‌ ఎండ్‌) టీమ్‌ పనిచేస్తోందనీ హన్సిక క్లారిటీ ఇచ్చింది.

పాపం, హన్సిక.. బ్యాక్‌ హ్యాండ్‌ టీమ్‌ అనగానే మళ్ళీ ట్రాలింగ్‌ షురూ అయ్యింది. 'అది బ్యాక్‌ హ్యాండ్‌ కాదు బేబీ, బ్యాక్‌ ఎండ్‌..' అంటూ 'ట్రాలింగ్‌' చేసేవారు ఓ రేంజ్‌లో ఈ 'దేశముదురు' పాపతో ఆటాడేసుకుంటున్నారు. అక్షర ఎపిసోడ్‌ వేరు, ఈ ఎపిసోడ్‌ వేరు. అక్షర హాసన్‌ తన ఫొటోల్ని తన 'బాయ్‌ఫ్రెండ్‌'తో పంచుకుంటే, అతని ఫోన్‌లోంచి ఆ ఫొటోలు బయటకొచ్చాయన్నది చివరికి తేలిన అంశం. మరి, హన్సిక విషయంలో ఏం జరిగిందట.? ఆమె ఎవరికన్నా అలా ఫొటోలు పంపించిందా.? ఏమో, ఇప్పటికైతే దీనిపై ఎలాంటి క్లారిటీలేదు.

ఇదిలావుంటే, హన్సిక పోలీసులను ఆశ్రయించనుందట. హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేయనుందట. ఈ విషయాల్ని హన్సిక సన్నిహితులు వెల్లడించారు. అంతా బాగానే వుందిగానీ, ఈ విషయమై హన్సిక ఎందుకింత కంగారు పడుతున్నట్లు.? మామూలుగా అయితే అందాల భామలకు హాట్‌ హాట్‌ ఫొటోసెషన్లు కొత్తేమీకాదు. వాటితో పోల్చితే లీక్‌ అయిన ఫొటోలు మరీ అంత హాట్‌గా ఏమీలేవు. కానీ, ఫొటోసెషన్‌కి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇలాంటి ఫొటోలకి అలాంటి జాగ్రత్తలుండవు. అదే తేడా.

మొత్తమ్మీద జరగాల్సిన 'డ్యామేజీ' జరిగిపోయాక, ఆ డ్యామేజీని కంట్రోల్‌ చేసుకోవడానికి హన్సిక నానా తిప్పలూ పడుతోందిప్పుడు.

జగన్, కేసీఆర్ కలయిక పరిణామం ఆంధ్రాలో ఎలా ఉండబోతోంది బిగ్ స్టోరీ 

సెక్సీ కామెంట్స్ః మగాళ్లు హద్దుల్లో ఉండాలిక!