సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు మరో మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖడ్జూ. వివిధ అంశాల గురించి తనదైన రీతిలో స్పందించే ఖడ్జూ.. గొగోయ్ పై అత్యంత తీవ్రంగా స్పందించడం గమనార్హం. గొగోయ్ ను ఒక సిగ్గులేని వ్యక్తిగా, అతడొక సెక్సువల్ పెర్వర్ట్.. అంటూ ఖడ్జూ ధ్వజమెత్తడం గమనార్హం.
తను 20 సంవత్సరాల పాటు లాయర్ పని చేసినట్టుగా, మరో 20 సంవత్సరాలు జడ్జిగా పనిచేసినట్టుగా.. అన్నేళ్ల తన అనుభవంతో.. గొగోయ్ అంతటి దారుణమైన జడ్జిని చూడలేదు అని ఖడ్జూ అన్నారు. షేమెలెస్, సెక్సువల్ పెర్వర్ట్, డిస్ గ్రేస్ ఫుల్.. అంటూ గొగోయ్ ను అభివర్ణించారు ఖడ్జూ. అంత దారుణమైన వ్యక్తి మరొకరు ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో గొగోయ్ పై ఒక సెక్సువల్ వేధింపుల వ్యవహారం చర్చకు వచ్చింది. మీ టూ రచ్చలో గొగోయ్ పేరు వినిపించింది. అయితే ఆ వెంటనే అది తెరమరుగు అయ్యింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే అలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా నిలిచింది. అయితే ఆ అంశం తొందరగానే తెరమరుగు అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో గొగోయ్ ను సెక్సువల్ పెర్వర్ట్ అంటూ ఖడ్జూ అభివర్ణించారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవి నుంచి అలా రిటైర్డ్ కాగానే గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అవుతుండటం విమర్శలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కూడా కొన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యన ఖట్జూ ఘాటు స్పందన చర్చనీయాంశంగా మారింది.