సినిమా సినిమాకూ గ్యాప్ ఇస్తూ హిట్ లు మాత్రమే ఇస్తూ వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. దృశ్యం, గోపాల గోపాల, గురు ఇప్పుడు ఎఫ్2. త్వరలో వెంకీ మామ సినిమా సెట్ మీదకు వెళ్లబోతున్నారు. ఈలోగా ఓసారి ఆరోగ్యం అన్నివిధాలా ఫిట్ గా వుండడానికి, పైగా తనకు వున్న బ్యాక్ పెయిన్ ను తగ్గించుకోవడానికి నేచుర్ క్యూర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వెంకీ విశాఖపట్నంలో వుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులుగా అక్కడి నేచుర్ క్యూర్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట. విశాఖ బీచ్ రోడ్ లో వెంకీ ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియో వుంది. మరి అక్కడ వుంటూనో, లేదా అక్కడికి సమీపంలో వున్ననేచుర్ క్యూర్ ఆసుపత్రిలో వుంటూనో ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఈ ట్రీట్ మెంట్ సిట్టింగ్స్ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వస్తారు. వెంకీకి ఇప్పటికి ఇప్పుడు షూటింగ్ ఏమీలేదు. వెంకీమామ స్టార్ట్ కావాలి. అది ఫినిష్ అయ్యేలోగా మరో స్క్రిప్ట్ ఫైనల్ చేసేపని కూడా వుంది. ఒకటి రెండు స్క్రిప్ట్ లు ప్రస్తుతం డిస్కషన్ లో వున్నాయి.
జగన్, కేసీఆర్ కలయిక పరిణామం ఆంధ్రాలో ఎలా ఉండబోతోంది బిగ్ స్టోరీ