విమర్శకు, దూషణకు చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని గుర్తించకో లేక ఉద్దేశపూర్వకంగానో తెలియదు కానీ, సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్స్ చేస్తుంటారు. ఎంత సెలబ్రిటీలైనా వాళ్లూ మనుషులే. వాళ్లకు కూడా మనసు ఉంటుంది. శ్రుతిమించిన కామెంట్స్‌కు మనసు నొచ్చుకోకుండా ఎలా ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కొందరు పోకిరీ నెటిజన్ల కామెంట్స్ హద్దులు దాటుతున్నాయి.
తనపై అసభ్య, తీవ్ర అభ్యంతరకర కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సహనం కోల్పోయి తిట్ల దండకానికి దిగింది. ఆ తిట్లు అలాంటివి, ఇలాంటివి కావండయ్…ఏకంగా “రేయ్ మీ అమ్మ…” అని మొదలు పెట్టాల్సి వచ్చింది. రకుల్‌ను అంతగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటంటే…
రకుల్ ప్రీత్‌సింగ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో 13 మిలియన్ల ఫాలోయర్స్‌ని కలిగి ఉన్నారు. ఇంత మంది అభిమానుల్ని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రకుల్ యాక్టీవ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళం, హిందీ భాషల్లో రెండేసి సినిమాల్లో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో కమల్‌హాసన్‌తో కలిసి ఆమె ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే శివకార్తికేయన్‌కు జంటగా ఐలాన్ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.
గ్లామరస్‌కు పెట్టింది పేరుగా రకుల్ ముద్రపడ్డారు. దీంతో ఆమె తన గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కోట్లాది మంది అభిమానులను కొత్త ప్రపంచంలో విహరింపజేస్తుంటారు. రకుల్‌ప్రీత్‌సింగ్ ఫొటోలను చూసి, ఆమె అందం, అభినయం గురించి ప్రశంసలు కురిపిస్తున్న వారి గురించి లెక్కేలేదు.
అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా హర్టింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ తన గురించి తీవ్ర అసభ్య కామెంట్ చేయడాన్ని ఆమె తెలిపారు.
రకుల్ ఫొటో చూసిన ఓ నెటిజన్…. “చొక్కా మాత్రమే ధరించి ఫోజు ఇచ్చారు. కింద ఏమీ ధరించలేదా ? కారులో ఉల్లాసంగా ఉండి అలానే బయటకు వచ్చారా?” అని చాలా అసభ్యంగా కామెంట్ చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కామెంట్ రకుల్‌లో తీవ్ర కోపాన్ని తెప్పించింది. ఆ నెటిజన్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. “రేయ్ మీ అమ్మ అలా చేసి ఉంటుంది. అందుకే దాన్ని తలచుకుని నన్ను కామెంట్ చేశావు” అని అంతే తీవ్రంగా సమాధానం ఇచ్చారామె.
కాగా ఇలాంటి కామెంట్లు చేసే వారిలో ఎక్కువగా నకిలీ ఫేస్‌బుక్ ఐడీలనే వాడుతుంటారని రకుల్ వివరించారు. అసలు ముఖాలను చూపడానికి ధైర్యం లేని పిరికివారే అసభ్యంగా కామెంట్స్ చేస్తుంటారని ఆమె అన్నారు.