శహభాష్..సుకుమార్

సమాజం మనకు ఇచ్చిన దాని నుంచి కొంత వెనక్కు ఇవ్వడం అన్నది ఓ కృతజ్ఞతా భావం. దీన్ని ఎవరూ గుర్తు చేయనక్కరలేదు. డిమాండ్ చేయనక్కరలేదు. ఎందుకు ఇవ్వాలి. మమ్మల్నే ఎందుకు అడగాలి అనే పిచ్చి…

సమాజం మనకు ఇచ్చిన దాని నుంచి కొంత వెనక్కు ఇవ్వడం అన్నది ఓ కృతజ్ఞతా భావం. దీన్ని ఎవరూ గుర్తు చేయనక్కరలేదు. డిమాండ్ చేయనక్కరలేదు. ఎందుకు ఇవ్వాలి. మమ్మల్నే ఎందుకు అడగాలి అనే పిచ్చి ప్రశ్నలు ఇక్కడ అనవసరం. సినిమా జనాలే కాదు, ఇలా ప్రతి ఒక్కరు భావిస్తేనే సమాజానికి శ్రేయస్కరం. 

దర్శకుడు సుకుమార్ ఇలాంటి సామాజిక బాధ్యతను ఫీలయ్యారు. సుమారు నలభై లక్షల వ్యయంతో ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు లో ఓ ఆక్సిజన్ ప్లాంట్ ను రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసారు దర్శకుడు సుకుమార్‌ 

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్‌ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు.   

డీఓసీఎస్‌ 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు. రాజోలులో ప్లాంట్‌ నిర్మాణం తక్షణమే చేపట్టి నాలుగురోజు ల్లోపూర్తిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. 

తొలుత రూ.25లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్న సుకుమార్‌ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న వుద్దేశంతో మరో రూ.15 లక్షలు జత చేసి మొత్తం రూ.40 లక్షలతోఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. 

ఇలా సినిమా, పారిశ్రామిక, పొలిటికల్ జనాలు తలుచుకుంటే ప్రతి జిల్లాలో మూడు నాలుగు ప్లాంట్ లు వస్తాయి. ఆక్సిజన్ కొరత అన్నదే లేకుండా పోతుంది.