పాయింటే: బాబు, పవన్, బీజేపీ ఆ హామీ ఇవ్వగలరా ?

ఏపీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సాధారణ ఖర్చులకే నిధుల లేమి పట్టిపీడిస్తోంది. ఓ వైపు కేంద్ర సాయం అరకొరగా కూడా లేదు. ఈ నేపధ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మేరకు స్థానిక…

ఏపీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సాధారణ ఖర్చులకే నిధుల లేమి పట్టిపీడిస్తోంది. ఓ వైపు కేంద్ర సాయం అరకొరగా కూడా లేదు. ఈ నేపధ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మేరకు స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే నిధులు ఏటా 5,800 కోట్ల రూపాయలు.

సకాలంలో అంటే 2018లో ఎన్నికలు పెట్టనందుకు ఇప్పటికే లోకల్ బాడీలకు నిధుల నష్టం వేల కోట్లలో జరిగింది. ఈ ఏడాది అయినా ఆ పరిస్థితి లేకుండా చూడాలని వైసీపీ సర్కార్ ఎన్నికలు జరిపిస్తోంది. అటువంటి ద్రుఢ దీక్షకు గండి కొట్టారు విపక్ష నేతలు అంటున్నారు వైసీపీ నేతలు.

లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేయాలి, రద్దు చేయాలి అన్న మాట తప్ప మొదటి నుంచి ఎన్నికలకు ఆసక్తి చూపని విపక్షాల మాట  మేరకు ఎన్నికల సంఘం కూడా తోడై వాయిదా వేసిందని వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వద్దు రద్దు అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలు కేంద్ర నిధుల గురించి ఏమంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు.

సరే ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదాకు మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ కేంద్రం వద్ద నిలిచిపోయిన 5,800 కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తామని బాబు, పవన్, బీజేపీ పెద్దలు హామీ ఇవ్వగలరా అని ఆయన సూటిగా నిలదీస్తున్నారు. మార్చి అంతానికి ఎన్నికలు జరగకపోతే నిధులు మురిగిపోతాయని తెలిసి కూడా సొంత రాజకీయం కోసమే  ఈ పార్టీలు అలా చేస్తున్నాయని మంత్రి విమర్శిస్తున్నారు.

ఆర్ధికంగా అతలాకుతలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ విషయంలో విపక్షాలు కలసిరావడంలేదని, అభివ్రుధ్ధి వద్దు అంటున్నారని మంత్రి మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు జరగనే కూడదన్న పంతంతో ప్రతిపక్షాలు ఉన్నాయని, వారు ప్రజలకు జవాబు చెప్పుకోవాలని కూడా ఆయన అంటున్నారు.

ద్యేవుడా…బ‌ట్ట‌ల్లేకుండా క‌నిపించ‌డం స్టార్ హీరోయిన్‌కు స‌ర‌దా అట‌!

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా