ఏపీలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ స్టేట్ ఈసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా భయాల నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా ఈసీ ఏకపక్షంగా ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది.
స్థానిక ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సి ఉన్న నిధుల విడుదల ఆగిపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే వాటితో పట్టకుండానే ఈసీ తన ఇష్టానికి వ్యవహరిస్తూ ఉంది. ఈ విషయంలో తన హక్కులను ఈసీ దర్జాగా వాడుకుంటున్నట్టుగా ఉంది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు, ఈసీ తన ఇగోని శాటిస్ ఫై చేసుకోవడానికి, తమ వారి ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.
ఇక ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి పూర్తిగా ఊరట లభించలేదు. ఎన్నికల నిర్వహణ అనేది ఈసీ అధికారం అని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయితే ఎన్నికలు ఎప్పుడో నిర్వహిస్తామని అంత వరకూ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ చెప్పడాన్ని మాత్రం కోర్టు తప్పు పట్టింది. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని స్పష్టం చేసింది. మళ్లీ ఎన్నికల నిర్వహించే సమయం వరకూ కోడ్ అమల్లో ఉండదు.
దీని వల్ల జగన్ ప్రభుత్వానికి పాక్షిక ఊరట లభించింది. ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను మాత్రం జగన్ ప్రభుత్వం కొనసాగించుకునే అవకాశం ఉంది.