బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకున్నారా?

రాజకీయాల్లో విశ్వాసాలకు కాలం చెల్లి చాలా కాలమే అయింది. అందలం ఎక్కించిన వారికే వెన్నుపోటు పొడిచిన వారు మహా నాయకులుగా చలామణీ అవుతున్న కాలమిది. మరి ఎపుడో చేసిన దాన్ని గుర్తుంచుకుని సరైన సమయంలో…

రాజకీయాల్లో విశ్వాసాలకు కాలం చెల్లి చాలా కాలమే అయింది. అందలం ఎక్కించిన వారికే వెన్నుపోటు పొడిచిన వారు మహా నాయకులుగా చలామణీ అవుతున్న కాలమిది. మరి ఎపుడో చేసిన దాన్ని గుర్తుంచుకుని సరైన సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంటే  దాని విలువ వెల కట్టలేనిదే.

ఆకలిగా ఉన్నపుడు రొట్టె ముక్క అయినా అమ్రుతంలా తోస్తుంది. టీడీపీ ఇపుడు అన్ని విధాలుగా చతికిలపడిపోయి ఉంది.  జగన్ మాటవరసకు 90 శాతం లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అనుకూలం కావాలంటే అది మించిపోయేలా ఉంది. మరో వైపు చూస్తే టీడీపీ నుంచి దిగ్గజ నేతలు పూటకొకరుగా వైసీపీ పక్కన చేరిపోతున్నారు.

ఈ నేపధ్యం చూసిన వారికి లోకల్ బాడీ ఫలితాలు వెల్లడైన నాటికి టీడీపీ బతికి బట్ట కడుతుందా అన్న అనుమానాలు కలగకమానవు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో  చంద్రబాబుకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా. రిటారై ఇంటికి చేరాల్సిన తనకు సమున్నతమైన పదవిని అందించిన బాబు రుణం అలా తీర్చుకున్నారా.

లోకల్ బాడీ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చిన నాటి నుంచే  అడ్డం పడిపోయి కోర్టులకెక్కినా రాని ఉపశమనాన్ని బాబుకు అలా  కలిగించారా.  అసలు ఎన్నికలే  జరగకుండా చేసి టీడీపీ  పరువు కాపాడారా. అంటే అవును అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.

మిమ్మల్ని ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టినందుకు గాను ఈ రకంగా బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకుంటారా అని మండిపడ్డారు. ఇది మంచి విధానంగా మీకు అనిపించవచ్చు కానీ, ఏపీ ప్రజల శ్రేయస్సు మీరు ఆలోచించారా. అసలు ఏ కారణంగా ఎన్నికలు వాయిదా వేశారో మీరైన చెప్పగలరా అంటూ నిమ్మగడ్డ మీద దాడి ప్రశ్నల వర్షం కురిపించేశారు.

మొత్తానికి బాబుకు అపుడెపుడో కేసీయార్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. కానీ నిమ్మగడ్డ వారు తాను ఇచ్చిన  గిఫ్ట్ చరిత్ర మరచిపోలేని విధంగా ఉండేలా చూసుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా 

ద్యేవుడా…బ‌ట్ట‌ల్లేకుండా క‌నిపించ‌డం స్టార్ హీరోయిన్‌కు స‌ర‌దా అట‌!