పెద్ద సినిమాలకు వున్న అడ్వాంటేజ్ అదే. పైగా రాజమౌళి లాంటి డైరక్టర్ సినిమాలకు వున్న అడ్వాంటేజ్. వాళ్ల పెదవి విప్పనక్కరలేదు కానీ వార్తలు పుట్టుకువస్తుంటాయి. ఆ వార్తలు కూడా సినిమాల రేంజ్ మాదిరిగా భారీగానే వుంటాయి.
లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మీద పుట్టిన వార్త, ఆ సినిమా ఆల్ లాంగ్వేజెస్, శాటిలైట్, డిజిటల్, ఇతరత్రా హక్కులు అన్నీకలిపి 132 కోట్లకు పలికేసాయన్నది. ఒకరు 132 కోట్లు అంటే, మనం కూడా అంతే అంటే కాపీ అనుకుంటారని ఇంకొకళ్లు 150 కోట్లు అని ఫిగర్ ను పెంచేస్తున్నారు.
ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఎంత పలుకుతుందన్నది అలా వుంచితే డీల్ ఫైనల్ కాలేదు అన్నది వాస్తవం. సరే, రాజమౌళి.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ సినిమా కాబట్టి, పైగా అన్నిభాషల నటులు వుంటారు కాబట్టి మంచి రేటే పలుకుతుంది. అందులో సందేహం లేదు. ఆ రేటు వందకోట్లు దాటే వుండొచ్చు.
కానీ అసలు విషయం ఏమిటంటే, ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏ చప్పుడూ లేదట. సినిమాకు ఇంకా బాగా ఆర్టిస్టుల ప్యాడింగ్ అదీ వచ్చి, ఓ రూపు వచ్చాక, అప్పుడు బేరాలు మొదలెడతారట. సినిమా సగానికి పైగా పూర్తయిన తరువాత కానీ మార్కెటింగ్ మీద దృష్టిపెట్టే ఆలోచన లేదని యూనిట్ వర్గాల బోగట్టా.
కానీ ఇంకోపక్క నారాయణ-చైతన్య ర్యాంకులు వల్లె వేసినట్లు 132..150..160 అంటూ గ్యాసిప్ లు మాత్రం ప్రచారం అయిపోతున్నాయి.