యాత్ర సెన్సార్ పూర్తి

వైఎస్ బయోపిక్ యాత్ర సెన్సారు కార్యక్రమం పూర్తయింది. టైటిల్స్ తో కలిపి రెండుగంటల ఆరు నిమషాల నిడివి వచ్చింది. వితవుట్ కట్స్ యు సర్టిఫికెట్ వచ్చింది సినిమాకు. ఫిబ్రవరి 8న యాత్ర విడుదల కాబోతోంది.…

వైఎస్ బయోపిక్ యాత్ర సెన్సారు కార్యక్రమం పూర్తయింది. టైటిల్స్ తో కలిపి రెండుగంటల ఆరు నిమషాల నిడివి వచ్చింది. వితవుట్ కట్స్ యు సర్టిఫికెట్ వచ్చింది సినిమాకు. ఫిబ్రవరి 8న యాత్ర విడుదల కాబోతోంది.

మమ్ముట్టి వైఎస్ రాజశేఖర రెడ్డిగా, జగపతి బాబు రాజా రెడ్డిగా.  రావు రమేష్ కేవిపి గా, సుహాసిని సబితా ఇంద్రారెడ్డిగా, అస్మిత విజయమ్మగా నటించిన ఈ సినిమాలో ఇంకా పోసాని కృష్ణ మురళి, అనసూయ తదితరులు కీలక పాత్రలు ధరించారు. 

గతంలో ఆనందో బ్రహ్మ లాంటి విజయవంతమైన సినిమాను అందించిన 70 ఎమ్ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై  విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకుడు. వైఎస్ జీవితంలోని కీలకఘట్టమైన పాదయాత్రను మెయిన్ ప్లాట్ గా తీసుకుని, దానికి కాస్త ముందు వెనుకలు జోడించి సెమీ బయోపిక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

సినిమా చివర్లో కొంత పార్ట్ వైఎస్ బతికి వున్నపుడు తీసిన అనేక విడియోల నుంచి రియల్ ఫుటేజ్ తీసుకుంటున్నారు.

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు