ఎన్నికలకు ముందు యాక్టివ్ గా ఉన్న వైసీపీ నేతలు, అధికారం చేపట్టిన తర్వాత ఎందుకో కాస్త వెనక్కు తగ్గారు. జగన్ పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్నా.. ఒకరిద్దరు మినహా మిగతావాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. రోజాలాంటి నేతలు కూడా కొన్నాళ్లు మౌనంగా ఉండటం వైసీపీ శ్రేణులకు మింగుడు పడని వ్యవహారం. కానీ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం మాత్రం వైసీపీ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చింది.
సహజంగా ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు లాంటి క్రిమినల్ ఆలోచనలున్న నాయకుడైతే.. అదే సామాజిక వర్గం నేతల్ని తెరపైకి తెప్పించి తిట్టించేవారు. కానీ జగన్ అలాంటి పని చేయలేదు. అయితే వైసీపీ నేతలు ఎవరూ ఆగలేదు. స్పీకర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు.. అందరూ ఎన్నికల కమిషనర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వీరి ఇన్వెస్టిగేషన్లోనే రమేష్ కుమార్తెకు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్ వ్యవహారం బైటపడింది. “కరోనా వ్యాప్తి చెందిన తర్వాతే ఇటలీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపారు, మరి ఇక్కడ ఇబ్బందేంటి” అని ప్రశ్నించారు మంత్రి అనిల్. “అత్యథిక పర్యాటకుల తాకిడి ఉన్న గోవా కూడా స్థానిక ఎన్నికలకు భయపడలేదు, మరి మనకెందుకండీ భయం” అని ప్రశ్నించారు మరో మంత్రి అవంతి శ్రీనివాస్. ఇలా ఎక్కడికక్కడ నేతలంతా పక్కాగా రమేష్ కుమార్ కి కౌంటర్లిచ్చారు.
“అసలు ఏ అధికారంతో ఎన్నికలను వాయిదా వేశారు? ఓ వైపు కరోనా భయం అంటారు, ఇంకోవైపు గొడవలు జరిగాయని కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలిస్తారు. రాజకీయ నాయకులకు రెండు నాల్కలు ఉండటం చూశాం కానీ, ప్రభుత్వ అదికారులకు కూడా రెండు నాల్కలు ఉండటం ఇప్పుడే చూశాం” అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ నేతలు.
ఈ ఒత్తిడి తట్టుకోలేక రెండోరోజే గవర్నర్ ని కలసి వివరణ ఇచ్చుకున్నారు రమేష్ కుమార్. అటు చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన లేఖకు కూడా సమాధానం చెప్పుకున్నారు. పనిలోపనిగా గవర్నర్ నుంచి కూడా చీవాట్లు తిన్నారని సమాచారం. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే ఈలోపే రమేష్ కుమార్ మాటల్లో మార్పు మొదలైంది. టాస్క్ ఫోర్స్, కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతిస్తే ముందుకెళ్లొచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మొత్తమ్మీద రమేష్ కుమార్ వ్యవహారం వైసీపీ నేతలందర్నీ ఒక్కటి చేసింది. అందరూ కలిస్తే అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలా ఒత్తిడి తీసుకు రావచ్చో అర్థమైంది. ఇకపై కూడా అన్ని సందర్భాల్లో వైసీపీ నేతలు ఇలాంటి యూనిటీయే చూపిస్తారని ఆశిద్దాం.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!