ఏజ్ బార్ అయిపోతే హీరోలకు ఇదే సమస్య వస్తుందేమో? ఇప్పటికే బాలయ్య ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాలు అంటే హీరోయిన్ ఎవ్వరూ దొరకరు. దొరికిన వారితో అడ్జస్ట్ కావాల్సిందే.
ఇప్పుడు మెగా బ్రదర్స్ కు కూడా ఈ సమస్య స్టార్ట్ అయింది. మెగాస్టార్ సైరా సినిమాకే హీరోయిన్ ఎలాగోలా సెట్ అయింది. ఆ తరువాత సినిమా ఆచార్యకు అంత వీజీ కాలేదు. త్రిష ఆఖరికి సెట్ అయింది అనుకుంటే, ఆమె జంప్ అయింది. మళ్లీ కాజల్ దగ్గరకే వెళ్లిపోవాలా? అన్నది మెగా ఆలోచనగా వినిపిస్తోంది. కానీ కాజల్ ఇఫ్పటికీ పెద్ద హీరోల దగ్గర నుంచి మీడియం హీరోల మీదుగా చిన్న హీరోల వరకు వచ్చేసింది.
ఇదిలా వుంటే పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో పవన్ కు హీరోయిన్ సమస్యే. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఆఖరికి శృతి హాసన్ ఫైనల్ అయింది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే అక్కడా సమస్యలు తలెత్తాయన్నది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠీ పేరు వినిపించింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరీ లావణ్య త్రిపాఠీనా అని వారి ఆవేదన. దీంతో ఎలాగైనా శృతిని ఫిక్స్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.
అసలే వకీల్ సాబ్ సినిమా బడ్జెట్ మీద నడుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ తప్పు చెప్పుకోతదగ్గ స్టార్ కాస్ట్ లేదు వకీల్ సాబ్ లో. కీలకమైన జడ్జి పాత్రకు కూడా అంతగా తెలియని నటుడిని తీసుకున్నారని బోగట్టా. ఇప్పుడు హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీ ఫిక్స్ అయితే సినిమాకు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అట్రాక్షన్ అవుతారు.
తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!