మహానాయకుడు.. కింకర్తవ్యం?

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు జరిగినంత పబ్లిసిటీ గానీ, ఆ సినిమాకు వచ్చినంత హైప్ గానీ ఇటీవల మరో సినిమాకు లేవు. కథానాయకుడు సినిమాకు తొలి నుంచీ ఓ ప్లాన్ ప్రకారం పద్దతిగా అన్నీ వదులుతూ…

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు జరిగినంత పబ్లిసిటీ గానీ, ఆ సినిమాకు వచ్చినంత హైప్ గానీ ఇటీవల మరో సినిమాకు లేవు. కథానాయకుడు సినిమాకు తొలి నుంచీ ఓ ప్లాన్ ప్రకారం పద్దతిగా అన్నీ వదులుతూ వచ్చారు. సినిమా రిలీజ్ వేళకు మాగ్జిమమ్ హైప్, బజ్ తెచ్చారు. సినిమాకు టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది.

కానీ, కలెక్షన్లు మాత్రం తేడాకొట్టేసాయి. కర్ణుడి చావుకి బోలెడు కారణాలు అన్నట్లు దీనికి బోలెడు రీజన్లు. రెండుభాగాలు చేయడం, తొలిభాగంలో సాగదీత, ఓవర్ సీస్ కోసం బుధవారం విడుదల చేయడం, యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్య సెట్ కాలేదనడం ఇలా చాలా అంటే చాలా వున్నాయి.

సరే, ఇప్పుడు విషయం అదికాదు. రెండోభాగం సంగతేమిటి? తొలిభాగం కొని దారుణాతి దారుణంగా నష్టపోయిన బయ్యర్ల పరిస్థితి ఏమిటి? ఓవర్ సీస్ లో సగానికి సగం అయిదు కోట్లు నష్టపోయారు బయ్యర్. ఈస్ట్ లో నిర్మాత అనిల్ సుంకర అయిదుకోట్లకు కొంటే కోటిరూపాయలు వచ్చింది. వైజాగ్-కృష్ణా కలిపి నిర్మాత సాయి కొర్రపాటి 11 కోట్లకు కొన్నారు. గట్టిగా నాలుగు కోట్లు రాలేదు.

నైజాం 16 కోట్ల అడ్వాన్స్ మీద చేస్తే నాలుగుకోట్లకు పైగా వెనక్కు వచ్చింది. గుంటూరు ఆరుకోట్ల రేంజ్ లో కొంటే సగానికి సగంపోయింది. ఇలా ప్రతిచోటా ఇదే జరిగింది. అయితే అందరి ధీమా ఒకటే రెండోభాగం వుంది అన్నదే.

ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే రికార్డెడ్ గా కాదు కానీ, అన్ రికార్డెడ్ గా రెండోభాగం డిస్ట్రిబ్యూషన్ కే ఇస్తాం. అందువల్ల మీకు భయంలేదు అని చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వుంది. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అంతా టెన్షన్ పడుతున్నవైనం అదే. ఏం జరుగుతుంది?  రెండో భాగం ఎలా ఇస్తారు? అడగాలా? వద్దా? అడిగితే ఏమంటారు? అడక్కపోతే ఏమిటి పరిస్థితి? అని.

యూనిట్ వైపు నుంచి అయితే చిన్న సమాచారం కూడా లేదట. అసలు సినిమా ఫస్ట్ వీక్ లోనే వస్తుందని కానీ, కాదు, వారం వెనక్కు వెళ్తుందని కానీ చెప్పడం లేదట. ఈ లాస్ లు ఎలా కవర్ చేస్తారు అన్నది క్లారిటీ లేదట. పంపిణీకే ఇస్తారు రెండోభాగం అనుకున్నా, అప్పుడు మళ్లీ అడ్వాన్స్ లు కట్టమంటే పరిస్థితి ఏమిటి? ఎక్కడ నుంచి తేవాలి. ఏ బయ్యర్ దగ్గరా రూపాయి లేదు. అది వాస్తవం.

'అస్సలు సమాచారం లేదు. ఏం జరుగుతోందో తెలియదు. జరుగుతుందో తెలియదు' అన్నారు ఓ బయ్యర్. 'వెళ్లి అడిగితే ఓ సమస్య, అడగకుంటే ఓ సమస్య అన్నట్లుంది మా పరిస్థితి' అన్నారు ఇంకో బయ్యర్. సాధారణంగా సినిమా లాస్ అయితే ఇరవై పర్సంట్ నష్టాలు భర్తీ చేయడం అన్నది టాలీవుఢ్ లో చాంబర్ పెద్దల ఒప్పందం.

కానీ ఈ సినిమాకు రావడమే ఇరవై, ముఫైశాతం వెనక్కు వస్తే, ఏం చేయాలి? ఏం చేస్తారు? అన్నది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన. వీటన్నింటికి సమాధానం చెప్పగలిగింది ఒక్క బాలయ్య మాత్రమే. ఆయనంతట ఆయన చెప్పాలి కానీ, వీళ్లు వెళ్లి అడిగేంత సీన్ వుండదు. అదే సమస్య.

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు