‘మహర్షి’కి లాభాలు వుండవా?

మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అవుతుంది. పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్ భారీగా వుంటుంది. లాభాలు తక్కువగా వుంటాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ లెక్కలు వేసుకుంటే, అస్సలు కిట్టుబాటు కాదు. అలాంటిది…

మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అవుతుంది. పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్ భారీగా వుంటుంది. లాభాలు తక్కువగా వుంటాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ లెక్కలు వేసుకుంటే, అస్సలు కిట్టుబాటు కాదు. అలాంటిది మహర్షిలాంటి భారీ సినిమాకు ముగ్గురు ప్రొడ్యూసర్లు. పైగా సినిమాకు గాను అశ్వనీదత్ ఎప్పడో ఏళ్ల క్రితం మహేష్ కు ఇచ్చిన అడ్వాన్స్.

దానికి వడ్డీల లెక్కలు. వీటన్నింటికి తోడు వంశీ పైడిపల్లి శ్రద్ధగా చెక్కే సినిమా పద్దతి. అన్నీకలిసి ఇప్పుడు మహర్షి బడ్జెట్ ను వందకోట్లకు పైగానే చేసేస్తున్నాయని తెలుస్తోంది. వందకోట్ల మార్కెట్ చేసిన భరత్ అనే నేను మాత్రమే మహేష్ కెరీర్ లో ఇటీవల హిట్టు. దానికే బయ్యర్లకు పదిశాత వరకు నష్టాలు తప్పలేదు.

మరి ఇప్పుడు ఈ సినిమాను ఏ రేంజ్ కు మార్కెట్ చేయాలి? ఏ రేంజ్ కు లాభాలు రావాలి? పెట్టుబడి చూస్తే అలా. ఇప్పటికే డార్జిలింగ్, అమెరిగా, రామోజీ ఫిలింసిటీ షెడ్యూళ్లు అయ్యాయి. ప్రస్తుతం కేరళ పొలాచ్చిలో అవుతోంది. ఇంకా పాటలకు విదేశాలు వెళ్లాల్సివుంది.

ఈ సినిమా ఏదో చేసాం అనిపించుకోవడానికి పనికి వస్తుంది తప్ప, లాభాలకు కాదని నిర్మాతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లితో వ్యవహారం అలాగే వుంటుంది. ఊపిరి సినిమా కూడా హిట్ నే. నిర్మాత పివిపికి మాత్రం లాస్. మహర్షి లెక్కలు విడుదలయ్యాక తెలియాలి.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!