అనిల్ రావిపూడి. మూడు సినిమాలు దిల్ రాజకు చేసిన దర్శకుడు. సాధారణంగా దిల్ రాజు దర్శకులను బాగా పాంపర్ చేస్తారు. వాళ్లను తనతో వుండేలా చూసుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఎఫ్ 3 సినిమా వుంటుందని ఇటు అనిల్ రావిపూడి, అటు దిల్ రాజు చెప్పగలిగారు.
అయితే ఈలోగా బయట ఓ సినిమా చేసి వస్తా అని అనిల్ రావిపూడి చెప్పేసాడు. ఆ మేరకు రెండు మూడురోజుల్లో ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే ఏ బ్యానర్ లో అన్నది ఇంకా తెలీదు. కేఎస్ రామారావు, మైత్రీమూవీస్, ఎన్ బికె ఫిలింస్, అనిల్ సుంకర ఇలా చాలామంది ప్రయత్నాల్లో వున్నారు.
ఇదిలావుంటే దిల్ రాజు యూనిట్ లో కొంతమంది జనాలతో అనిల్ రావిపూడి కాస్త అన్ కంఫర్ట్ బుల్ గా వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అనిల్ రావిపూడి తన సన్నిహితులు కొంతమంది దగ్గర ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.
సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల విషయంలోనో, ఇతరత్రా విషయాల్లోనో, దిల్ రాజు యూనిట్ లో కొందరి వ్యవహారాలు అనిల్ రావిపూడికి నచ్చడంలేదని వినికిడి. అయితే అదే సమయంలో దిల్ రాజుతో మాత్రం అతనికి సమస్య ఏమీలేదని కూడా తెలుస్తోంది.
ఈసారి సినిమా చేసేముందు అనిల్ రావిపూడి నేరుగా దిల్ రాజుతోనే ఈ విషయాలు ప్రస్తావిస్తారని కూడా తెలుస్తోంది. ఆ మేరకు యూనిట్ జనాల్లో కాస్త మార్పులు చేర్పులు చేయమని అడుగుతారని టాక్. ప్రస్తుతానికి పొగే కనిపిస్తోంది. నిప్పు ఎక్కడో వుండే వుంటుంది.