భయానికి అటు.. ఇటు…

మిగిలిన పరిశ్రమలను చూసి కన్నడ పరిశ్రమ మారుతోంది. అన్ని భాషలకు కలిపి కేజిఎఫ్ ను అందించింది. చార్లీ 777 ఇచ్చింది. ఇలా వైవిధ్యం, భారీతనం రెండూ కలిసిన సినిమాల మీద దృష్టి పెట్టింది.  Advertisement…

మిగిలిన పరిశ్రమలను చూసి కన్నడ పరిశ్రమ మారుతోంది. అన్ని భాషలకు కలిపి కేజిఎఫ్ ను అందించింది. చార్లీ 777 ఇచ్చింది. ఇలా వైవిధ్యం, భారీతనం రెండూ కలిసిన సినిమాల మీద దృష్టి పెట్టింది. 

ఇప్పుడు ఆ కోవలోనే వస్తున్న మరో సినిమా విక్రాంత్ రోణ. కన్నడ మాస్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా. ఈ సినిమా మీద ఎప్పటి నుంచో ఆసక్తి కరమైన వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ట్రయిలర్ వచ్చింది.

ఓ ఊహాతీత ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు విక్రాంత్ రోణ దర్శకుడు అనూప్ భండారీ. 'ఎందుకో' భయపడే ఊరికి…అస్సలు భయమంటే తెలియని మనిషి వస్తే…అసలు ఏమిటీ భయం..ఎందుకీ భయం..అన్నది అన్వేషించడం ప్రారంభిస్తే. అన్నది పాయింట్ వరకే. కానీ విజువల్ గా వేరుగా వుంది. 

ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కు కాల్పనిక విజువల్స్ వండర్ ఫుల్ గా జోడిస్తే…అన్నదే అసలు విషయం. అందుకే ఈ సినిమాను త్రీడీ లో కూడా తీస్తున్నారు. 

ట్రయిలర్ లో విజువల్స్ కానీ, ఫ్రేమ్ లు కానీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కనిపించాయి. కథ, విషయం కన్నా విజువల్స్ మీదనే దర్శకుడు ఎక్కువ దృష్టిపెట్టనట్లు కనిపిస్తోంది. ఈ రోజుల్లో డిఫరెంట్ కాన్సెప్ట్, విజువల్స్ ఇవన్నీ చూసి కానీ జనం థియేటర్ కు రావాలా?వద్దా? అన్నది డిసైడ్ కావడం లేదు. 

కిచ్చా సుదీప్ నా? మరోకరా? అన్న దానికన్నా ఇదే కీలకం. అందుకే ఈ విధంగా సినిమాను ప్రెజెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.