నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించడానికి తలపెట్టిన సినిమా ఒకటి వుంది. ఈ సినిమా వ్యవహారం మొదటి నుంచీ ఆబ్లిగేషన్ మీదే నడుస్తోంది. ఆ సినిమాకు కొత్త లేడీ డైరక్టర్ లక్ష్మీ సౌజన్య పని చేస్తున్నారు. నిర్మాత చినబాబు కు కథ నచ్చి చేస్తున్నారన్నది బయటకు టాక్. కానీ ఆయనకేదో ఆబ్లిగేషన్ వుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. మొత్తం మీద మూడేళ్ల పాటు ఈ కథకు మఫై మూడు వెర్షన్లు రాయించి, ఆఖరికి నౌగశౌర్యను మొహమాట పెట్టి ఒప్పించారు.
నాగశౌర్య కూడా చినబాబు నిర్మాత, పెద్ద బ్యానర్ కనుక, కథ వినకుండానే ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త డైరక్టర్ అనే ఆలోచనతో టెస్ట్ షూట్ అంటూ స్టార్ట్ చేసి కొన్ని రోజలు వర్క్ చేసారు. అవుట్ పుట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ, ముందుకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
కానీ సెట్ లో డైరక్టర్ వర్క్, తీసిన సీన్లు చూసిన తరువాత నాగశౌర్య ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పైగా సినిమాలో నటిస్తున్న మిగిలిన నటులు కూడా ఈ ప్రాజెక్టును శౌర్య ఎందుకు ఓకె చేసాడా? అని గుసగుసలు పోతున్నట్లు, అవన్నీ హీరో దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు శౌర్య ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఎవరినీ అద్భుతాశ్చర్యాలకు గురించేయని ఆ స్క్రిప్ట్ మీద చినబాబుకు ఎందుకంత పట్టుదలో ఆయనకే తెలియాలి.ఇదిలా వుంటే శౌర్య ఈ ప్రాజెక్టు కాకుండా శరత్ మరార్, మహేష్ కోనేరు, పీపుల్స్ మీడియా సంస్థలు నిర్మించే మూడు సినిమాలు చేయాల్సి వుంది.