Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆయనది అంతా సెంట్రల్ లెవెల్!

ఆయనది అంతా సెంట్రల్ లెవెల్!

పవన్ కళ్యాణ్ పొరబాటున స్టేట్ పాలిటిక్స్ డీల్ చేస్తున్నాడేమో అని అప్పుడప్పుడు సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. సాధారణ విషయాల మీద ఆయన రంకెలు వేసినా కూడా అవి నేషనల్ లెవెల్లోనే ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ చంక ఎక్కి కూర్చోవడానికి ముందు… అంటే గత ఎన్నికలకు పూర్వం.. తన పార్టీని ఆక్టివేట్ చేసినప్పుడు కూడా.. ఆయన అప్పట్లోని రాష్ట్ర ప్రభుత్వం మీద కంటే కేంద్రం మీదనే ఎక్కువగా రంకెలు వేశారు.

చంద్రబాబుపై ఉన్న ప్రేమ ఆయనతో అలా చేయించింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతూ ఉంటే.. వాటిమీద కూడా.. తాను కేంద్రంతో మాత్రమే మాట్లాడతానని ఆయన అనడం కామెడీగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత నుంచి… స్థానిక ఎన్నికల్లో స్టేట్ మొత్తం తమ పార్టీ పోటీ చేస్తుందని అంటూ పవన్ చాలా చాలా ప్రగల్భాలు పలికారు.

పార్టీని నిర్వహించేందుకు ఓపిక లేక… బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. రెండు పార్టీలు కలిపి కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థులని పోటీ చేయించడానికి విఫలమయ్యాయి. కనీసం వారికి కేండిడేట్ లకు గతి లేకుండా పోయింది. తమ అసక్తతను కప్పిపుచుకోవడానికి.. ప్రభుత్వంపై నిందలు వేయడం అనే కుయుక్తులకు వారు పాల్పడ్డారు.

రాష్ట్రంలో అతి పరిమితంగా కొన్ని చోట్ల జరిగిన అల్లర్లను ఆధారం చేసుకుని, ప్రభుత్వానికి బురద పులమడానికి వారు విఫలయత్నం చేశారు. ఆ తంతు కూడా ముగిసిపోయింది. ఇక.. కనీసం 6 వారాల తర్వాత అయినా జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే గనుక, ప్రజలకు ఏమి జవాబు చెప్పుకోవాలో తెలియక ఇప్పటినుంచే స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, రభాసల గురించి తమ పార్టీ కార్యకర్తలు తనకు వీడియోలు పంపితే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానంటూ ఆయన కొత్త ప్రగల్భాలు అందుకుంటున్నారు. కొన్నిచోట్ల చెదురు మదురు సంఘటనలు జరిగినందుకు… చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నట్లుగా… మొత్తం ఎన్నికలను రీషెడ్యూలు చేయాలని అడిగిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది.

ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు తాను సీఆర్పీఫ్ బలగాలను తీసుకువచ్చి, వారి సమక్షంలో స్థానిక ఎన్నికలను జరిపిస్తా అనే రేంజిలో పవన్ ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు అసలు పెడుతున్నారు. ఏకబిగిన ప్రారంభించిన రెండు సినిమాల షూటింగులో బిజీగా గడుపుతూ… తాను నడిపే షాట్ గాప్ రాజకీయాలకు ప్రజలు, చివరికి తన అభిమానులైన యువత కూడా భ్రమలో మునిగే రోజులు గతించిపోయాయని… పవన్ గుర్తించడం లేదు.

తన సినీ అభిమాన ప్రపంచం ఎప్పటికీ తనకు ఓట్లు వేస్తూనే ఉంటుందనే భ్రమలు ఆయనలో ఉన్నాయి. అయితే… ఏమాత్రం తేడాగా ఉన్నా.. వంద రూపాయలు పెట్టి టికెట్ కొని, సినిమా హిట్ చేయడానికే ముందుకురాని అభిమానులు… ఏకంగా అధికారాన్ని అప్పనంగా తన చేతిలో పెట్టేస్తారని ఆయన ఎలా భావిస్తున్నారో ఏమో మరి...?

నన్ను కూడా సేమ్ టు సేమ్ అంటారేమోనని కొంచెం భయం

యుద్ధం మధ్యలో యోగాసనాలు వెయ్యకూడదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?