తను కరోనా నుంచి కోలుకున్నట్టుగా తెలిపారు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్. ఈ అమెరికన్ హీరో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. హాంక్స్ తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకిందని వైద్యులు గత వారంలో ధ్రువీకరించారు. అక్కడ వీరు వైద్యచికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హాంక్స్ ఇన్ స్టాగ్రమ్ లో ఒక పోస్టు పెట్టాడు.
తను, తన భార్య కరోనా నుంచి కోలుకున్నట్టుగా తెలిపాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినట్టుగా కూడా ఈ నటుడు తెలపడం గమనార్హం. కరోనా సోకినప్పుడు తాము జలుబు, బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడినట్టుగా హాంక్స్ తెలిపాడు. ఇప్పుడు కోలుకున్నట్టుగా వ్యవరిహరించాడు.
ఆసుపత్రి నుంచి కూడా హాంక్స్ డిశ్చార్జి కావడంతో.. కరోనా వైరస్ వైద్యానికి లొంగుతుంది అనడానికి మరో ఆధారం దొరికినట్టే. కరోనా ప్రాణాంతక వైరస్ అయినప్పటికీ చాలా మందికి వైద్యులు అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులతోనే ట్రీట్ చేస్తున్నారు. చాలా మందికి నయం చేసి పంపిస్తున్నారు.
సామాన్యులు డిశ్చార్జి అవుతున్న విషయాలకు అంత ప్రచారం రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో హాంక్స్, ఆయన భార్యకు నయం కావడంతో.. కరోనాను వైద్యశాస్త్రం ఎదుర్కొంటోందనే అంశానికీ ప్రచారం రావాలి.