బాబుకు స్థానిక ఎన్నికలంటే చిన్న చూపే!

స్థానిక పాలన అన్నది చాలా ముఖ్యం. ప్రభుత్వాలు ఎక్కడో ఉన్నా కూడా జనాలకు నేరుగా కనిపించే ప్రతినిధుల సేవలు చాలా అవసరం. ఆ సంగతి తెలిసే  అన్ని రాష్ట్రాలు లోకల్ బాడీ ఎన్నికలకు ఎక్కువ…

స్థానిక పాలన అన్నది చాలా ముఖ్యం. ప్రభుత్వాలు ఎక్కడో ఉన్నా కూడా జనాలకు నేరుగా కనిపించే ప్రతినిధుల సేవలు చాలా అవసరం. ఆ సంగతి తెలిసే  అన్ని రాష్ట్రాలు లోకల్ బాడీ ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి.

ఇక రాజ్యాంగ సవరణల తరువాత నేరుగా పంచాయతీలలకు, ఇతర లోకల్ బాడీలకు నిధులను కేంద్రమే ఇస్తోంది. ఆ విధంగానైనా ఎన్నికలు పెడతారని, స్థానిక సంస్థలు బతుకుతాయని ఉద్దేశించారు.

అయితే రాజకీయంగా మందంగా మారిపోయిన పార్టీలు, అధినేతలూ లోకల్ బాడీలను ఎపుడూ చులకనగానే చూస్తూ వచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయనికి వస్తే ఆయన తాను ముమ్మారు ముఖ్యమంత్రినని, దాదాపు 14 ఏళ్ళ పాటు పాలించానని  తరచూ  గొప్పలు చెప్పుకుంటారు.

మరి బాబు ఏలుబడిలో స్థానిక ఎన్నికలు ఎపుడైనా పెట్టారా అంటే కేవలం ఒక్కసారి మాత్రమే నిర్వహించారు. తన చేతిలో అవకాశం, అధికారం ఉన్నా కూడా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా బాబు అలా తోసేస్తూనే వచ్చారు.

ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మింది నెలల్లోనే ఎన్నికలకు వెళ్తే మాత్రం బాబు అడ్డంగా పడుకుని అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు అంటున్నారు. పంచాయ‌తీలు చేయడం మీద ఉన్న శ్రధ్ధ బాబుకు పంచాయతీల మీద లేదని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి  చూడబోతే పంచాయతీలకూ, బాబుకు ఏదో తెలియని వైరమే ఉన్నట్లుంది.

యుద్ధం మధ్యలో యోగాసనాలు వెయ్యకూడదు

నన్ను కూడా సేమ్ టు సేమ్ అంటారేమోనని కొంచెం భయం