ఎన్ని నాలుకలు బాబూ మీకు?

దేశ ప్రయోజనాల రీత్యా కేసిఆర్ తో కలిసి ప్రయాణించాలనుకున్నాను – చంద్రబాబు Advertisement కేసిఆర్ తో కలిసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నించినా, అట్నుంచి సానుకూల వాతావరణం కనిపించలేదు – రాజకీయ పరిశీలకులు. కేసిఆర్-చంద్రబాబు…

దేశ ప్రయోజనాల రీత్యా కేసిఆర్ తో కలిసి ప్రయాణించాలనుకున్నాను – చంద్రబాబు

కేసిఆర్ తో కలిసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నించినా, అట్నుంచి సానుకూల వాతావరణం కనిపించలేదు – రాజకీయ పరిశీలకులు.

కేసిఆర్-చంద్రబాబు కలిస్తే మంచిదని నేను ముందే సూచించాను… బాబు అనుకూల మీడియా.

కేసిఆర్ కలిసి రాకపోవడం వల్లనే కాంగ్రెస్ తో మహాకూటమి – చంద్రబాబు మద్దతుదార్లు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత ఇలాంటి మాటలు తెగ వినిపించాయి.

నిత్యం పత్రికలు చదివేవారికి క్లియర్ గా అర్థం అయింది. తెలిసింది. చంద్రబాబు ఎంత తహతహలాడారో? కేసిఆర్ తో పొత్తుకోసం అన్నది.

నిత్యం పత్రికలు చదివేవారికి స్పష్టంగా తెలుసు. కేసిఆర్-చంద్రబాబును ఎలాగైనా కలపాలనే ప్రయత్నాలు ఎంతలా సాగాయో.

ఎందుకంటే కేసిఆర్ ను ఢీకొని చంద్రబాబు తెలంగాణలో సాధించేది లేదు. అందుకే ఆ ప్రయత్నాలు చేసారు. చంద్రబాబు కూడా ప్రయత్నించారు. కానీ సాధ్యంకాలేదు. చంద్రబాబుతో జంటకడితే ఎలా వుంటుందో గతంలో అనుభవం వున్న కేసిఆర్ ముందుకు రాలేదు.

ఎన్నికలు అయిపోయాయి. బాబు పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. బాబుతో కలిసి వెళ్లిన ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలయింది. ఇక చాలు ఈ పొత్తు. ఇక వద్దు అని కాంగ్రెస్ నాయకులే తీర్మానించేసారు.

ఇదిలా వుంటే..
ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర ఎంపీలు అంతా మొత్తుకున్నా, వినకుండా వాళ్లను దూరంపెట్టి, పార్లమెంటు తలుపులు గడియపెట్టి మరీ రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కమని పిలుపు ఇచ్చింది చంద్రబాబు.

2014 ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ వైకాపాతో రంకు అంటకట్టింది చంద్రబాబు.

కానీ అదే చంద్రబాబు 2018 తెలంగాణ ఎన్నికల్లో జతకట్టింది అదే కాంగ్రెస్ పార్టీతో.

అదే చంద్రబాబు 2019 పార్లమెంట్ ఎన్నికలకు కలిసి వెళ్తున్నది కాంగ్రెస్  పార్టీతో.

కానీ…
అదే చంద్రబాబుకు కేసిఆర్ పార్టీతో జగన్ పార్టీ చర్చలు జరిపితే తప్పు అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్ గా కేసిఆర్ ఆంధ్రులను అవమానించారు. ఆంధ్రులను తిట్టారు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.

ఇక చంద్రబాబు అను'కుల' మీడియా అయితే జగన్ ఆంధ్రుల పట్ల మహాపరాధం చేస్తున్నారన్నట్లు వాపోతోంది.

కానీ ఇదే మీడియా తనంతట తానే బాబు-కేసిఆర్ కలవాలని పదే పదే ప్రవచించిన విషయం చాలా కన్వీనియెంట్ గా మరిచిపోతోంది.

జగన్-కేటీఆర్ ఇలా మీట్ అయ్యారో లేదో అలా బురద జల్లేయడం ప్రారంభించేసారు చంద్రబాబు ప్లస్ ఆయన అనుకుల మీడియా. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించేయాలని కిందామీదా అయిపోతున్నారు. మరి కేసిఆర్ తో బాబు కలవాలనుకున్నపుడో? లేదా కాంగ్రెస్ తో కలిసినపుడో ఈ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టుపెట్టారో ఆ మీడియా, ఆ బాబుగారు చెప్పగలరా?

వినే జనం వెర్రి వాళ్లలా కనిపిస్తే, వాళ్లకు ఎన్నయినా చెబుతారు చంద్రబాబు అయినా, ఆయన అను'కుల' మీడియా అయినా ?

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!