గత కొంతకాలంగా బిజినెస్ పరంగా స్ట్రగుల్ అవుతున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజుకు ఈ సంక్రాంతి మాంచి ఊరట ఇచ్చింది. దాదాపు పదికోట్లు సాలిడ్ గా ఖాతాలోకి చేరేలా కనిపిస్తోంది. ఎఫ్ 2 సినిమా ఆయనకు మాంచి రిటర్న్ లు ఇచ్చే సూచనలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
36 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎఫ్ 2 సినిమా నుంచి మంచి లాభాలే కళ్ల చూసేలా వున్నారు దిల్ రాజు. 36 కోట్లతో నిర్మించిన సినిమాకు శాటిలైట్, డిజిటల్ ద్వారా 8 కోట్లు రికవరీ వచ్చింది. ఓవర్ సీస్, రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు అమ్మకాల ద్వారా దగ్గర దగ్గర 20 కోట్ల వరకు రికవరీ వచ్చింది.
ఎనిమిది కోట్ల రిస్క్ తో నైజాం, కృష్ణ, వైజాగ్ ఏరియాలు చేతిలో వుంచుకుని సినిమాను విడుదల చేసారు. ఇప్పటికే ఈ ఏరియాల మీద షేర్ 12 కోట్లు దాటేసింది. ఈవారం సినిమాలు ఏవీలేవు. వచ్చేవారం ఒకే ఒక్క సినిమా వుంది. అందువల్ల మరో పది రోజులపాటు మాంచి కలెక్షన్లు వచ్చే సూచనలు అయితే క్లియర్ గా వున్నాయి.
టోటల్ రన్ లో ఓ పదిహేను కోట్లు దిల్ రాజుకు మిగులు కనిపిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే, ఇదే సంక్రాంతికి దిల్ రాజుకు వినయ విధేయరామ సినిమా కాస్త గట్టి మొట్టికాయే మొట్టింది. దాదాపు ఈ సినిమా వల్ల దిల్ రాజుకు ఓ అయిదారు కోట్లు నష్టం తప్పకపోవచ్చు.
అందువల్ల కూడికలు, తీసివేతలు చూసుకుంటే ఓ పది కోట్లు ఈ సంక్రాంతికి మిగిలే అవకాశం వుంది.